'బింబిసార' స్ట్రాటజీ.. మళ్ళీ సైలెంట్ గా వస్తున్న కళ్యాణ్ రామ్!
on Oct 11, 2022

ఈ ఏడాది 'బింబిసార'తో బ్లాక్ బస్టర్ అందుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ మరో చిత్రంతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం హీరోగా కళ్యాణ్ రామ్ కి 19వది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన కీలక అప్డేట్ వచ్చింది.
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో రూపొందిన 'బింబిసార' పెద్దగా హడావిడి లేకుండా సైలెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకుంది. విడుదలకు కొద్ది రోజుల ముందు మాత్రం పక్కా ప్లానింగ్ తో భారీగా ప్రమోషన్స్ చేసి జనంలోకి తీసుకెళ్లారు. ఆ సినిమా ఘన విజయం సాధించి కళ్యాణ్ రామ్ కి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇదిలా ఉంటే కళ్యాణ్ రామ్ తన తదుపరి సినిమాలకి కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నట్లు అనిపిస్తోంది.

కళ్యాణ్ రామ్ 19వ సినిమాకి సంబంధించి తాజాగా మైత్రి మూవీ మేకర్స్ కీలక అప్డేట్ ఇచ్చింది. రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇటీవల గోవాలో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుందని, త్వరలోనే చివరి షెడ్యూల్ ప్రారంభమవుతుందని తెలిపింది. త్వరలో మరిన్ని వివరాలు తెలుపుతామని చెబుతూ ఓ పోస్టర్ ని విడుదల చేశారు. ఓ భారీ యాక్షన్ సన్నివేశంలో కళ్యాణ్ రామ్ గన్స్ పట్టుకొని వస్తున్నట్టుగా ఉన్న పోస్టర్ ఆకట్టుకుంటోంది.
'ఎన్.కె.ఆర్.19' షూటింగ్ చివరి దశకు చేరుకుందన్న న్యూస్ ఆసక్తికరంగా మారింది. 'బింబిసార' స్ట్రాటజీ వర్కౌట్ అయ్యి కళ్యాణ్ రామ్ మరో బ్లాక్ బస్టర్ అందుకుంటాడేమో చూడాలి. ఇదిలా ఉంటే కళ్యాణ్ రామ్ 'డెవిల్' అనే చిత్రాన్ని కూడా చేస్తున్నాడు. ఆ సినిమా గురించి కూడా పెద్దగా ఏ హడావిడి లేదు. ముందు కంటెంట్ మీద దృష్టి పెట్టి, సైలెంట్ గా సినిమాని పూర్తి చేసి, ఆ తర్వాత భారీ ప్రమోషన్స్ తో సినిమా విడుదల చేయాలన్న కళ్యాణ్ రామ్ స్ట్రాటజీ ముందు ముందు ఎలాంటి ఫలితాలు ఇస్తుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



