నిర్మాతగా మారుతున్న యంగ్ హీరో?
on Jul 11, 2020

'ఈ నగరానికి ఏమైంది?', 'ఫలక్ నుమా దాస్', 'హిట్' సినిమా విజయాలతో తెలుగు సినిమా పరిశ్రమలోకి యంగ్ హీరో విశ్వక్ సేన్ సర్రున దూసుకొచ్చాడు. సినిమా ఫంక్షన్స్, ప్రెస్ మీట్స్ లో అగ్రెసివ్ నేచర్ తో యూత్ ను ఆకట్టుకున్నాడు. ఇప్పుడు హీరో చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. 'హిట్'కి సీక్వెల్, 'పాగల్' సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండూ కాకుండా మరో సినిమా చేయడానికి విశ్వక్ సేన్ ప్లాన్ చేస్తున్నాడని ఫిలిం నగర్ టాక్. అయితే, అందులో అతడు నటించడం లేదు. మరో హీరోతో సినిమా తీసి ఓటీటీకి అమ్మాలని ప్లాన్ చేస్తున్నాడట. అతడికి దిల్ రాజు సపోర్టు ఉందని సమాచారం.
'హిట్' సినిమా డైరెక్టర్ శైలేష్ కొలను అందించిన కథతో ఎడిటర్ గారి ని దర్శకుడిగా పరిచయం చేస్తూ విశ్వక్ సేన్ సినిమా నిర్మిస్తాడని సమాచారం. దీనికోసం అప్ కమింగ్ చోటా హీరోని ఒకరిని అప్రోచ్ అయ్యారట. అతడు ఇంకా ఓకే చెప్పలేదని టాక్. శైలేష్ కొలను తండ్రి దిల్ రాజు ఆఫీసులో పని చేస్తారు. హిట్ సినిమా చూసిన దిల్ రాజు... నాని దగ్గర నుండి కొన్ని విడుదల చేశారు. శైలేష్ టాలెంట్ పై నమ్మకంతో ఈ సినిమాకి బ్యాక్ ఎండ్ సపోర్ట్ చేస్తున్నారట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



