'విశ్వక్' ఫస్ట్ లుక్
on Jan 2, 2020
స్టార్టప్ కంపెనీలు ఎలా ప్రపంచ వాణిజ్యాన్ని శాసిస్తున్నాయో తెలిపే కథాంశంతో 'విశ్వక్' అనే మూవీ రూపొందుతోంది. అజయ్ కథుర్వర్, డింపుల్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను నూతన సంవత్సరం సందర్భంగా విడుదల చేశారు. గోల్డెన్ డక్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వేణు ముల్కల దర్శకత్వంలో తాటికొండ ఆనందం బాలక్రిషన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టేబుల్‌పై రెండు చేతులూ ఆనించి ఇంటెన్స్ లుక్‌తో కనిపిస్తున్న హీరో, పేపర్ కటింగ్స్, వాటిని ఓ బోర్డ్‌కు పిన్ చేసినట్లు ఉండటం.. ఇవన్నీ చూస్తుంటే 'విశ్వక్' ఒక డిఫరెంట్ మూవీ అనే ఆసక్తిని రేపుతుంది.
ఇండియాలో ప్రారంభమైన కొన్ని స్టార్టప్ కంపెనీలు, వాటిని స్థాపించిన యువత ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారు, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుందనే అంశాన్ని కూడా ఈ సినిమాలో చూపించబోతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా టీజర్‌ను త్వరలోనే విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. స్టైలిష్‌గా, నేటి తరానికి తగ్గట్లు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రదీప్ దేవ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు సత్యసాగర్ సమకూరుస్తున్న సంగీతం ఎస్సెట్ అని దర్శక నిర్మాతలు చెబుతున్నారు.