నా ఫేస్ బుక్ పేజీ హాక్ అయ్యింది...అన్ ఫాలో చేయండి
on Oct 19, 2022
.webp)
విష్ణుప్రియ తెలుగులో హాట్ యాంకర్. ఇటీవల "జరీ జరీ" సాంగ్ తో ఫుల్ ఫేమస్ అయ్యింది. సోషల్ మీడియాలో విష్ణుప్రియ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇప్పుడు విష్ణుప్రియా తన ఫాన్స్ కి కోసం ఇన్స్టాగ్రామ్ స్టేటస్ ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేసింది. విష్ణుప్రియ ఫేస్‌బుక్ అకౌంట్ లో చాలా అసభ్యకరమైన ఫోటోలు కనిపించేసరికి నెటిజన్లు షాక్ అయ్యారు. దీని గురించి ఆరా తీసేసరికి అసలు విషయం తెలిసింది.
ఇంతకూ విషయం ఏంటంటే.. విష్ణుప్రియ ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ అయ్యింది అని అర్ధమయ్యింది. ఈ విషయం తెలుసుకున్న విష్ణుప్రియ వెంటనే అలెర్ట్ అయ్యింది. తన అకౌంట్ హ్యాక్ అయిన విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. ”విష్ణుప్రియభీమనేని ఫేస్ బుక్ పేజీ హ్యాక్ అయ్యింది. దయచేసి ఈ సమాచారాన్ని అందరికీ తెలియజేయండి. ఆ పేజిని అన్ ఫాలో చేయండి” అని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది విష్ణు. ఇక విష్ణుప్రియకు ఇన్‌స్టాగ్రామ్‌లో 11 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. విష్ణు ప్రియా ‘పోరా పోవే’ అనే ప్రోగ్రాంతో మంచి ఫేమ్ దక్కింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



