అప్పుడే ఓటీటీలోకి 'విక్రమ్'.. ఎప్పుడంటే?
on Jun 21, 2022

యూనివర్సల్ స్టార్ స్టార్ కమల్ హాసన్ టైటిల్ రోల్ పోషించిన 'విక్రమ్' మూవీ జూన్ 3న విడుదలై భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా రూ.360 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన ఈ సినిమా 400 కోట్ల దిశగా పరుగులు తీస్తోంది. థియేటర్స్ లో కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న ఈ చిత్రం త్వరలో ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమవుతుందని తెలుస్తోంది.
చాలా కాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న కమల్ కి 'విక్రమ్' రూపంలో భారీ విజయం లభించింది. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ 'బాహుబలి-2' రికార్డు బ్రేక్ చేసి తమిళనాడులో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి, సూర్య కీలక పాత్రలు ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా యాక్షన్ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూ మూడో వారం పూర్తి చేసుకోబోతుంది. అయితే ఈ సినిమా ఐదు వారాలకే ఓటీటీలోకి అందుబాటులోకి రానుందని ప్రచారం జరుగుతోంది.
'విక్రమ్' డిజిటల్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ సంస్థ హాట్ స్టార్ భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. జులై 8 నుంచి హాట్ స్టార్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



