చాందినిని మసి చేస్తానని బెదిరించిన నిర్మాత ఎవరు?
on Jun 21, 2022
.webp)
చాందిని చౌదరి షాట్ ఫిలిమ్స్ తో కెరీర్ స్టార్ట్ చేసింది. తర్వాత మూవీస్ లో యాక్ట్ చేస్తోంది. కలర్ ఫోటో మూవీ తో చాందిని హిట్ కొట్టి ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఇప్పుడు కిరణ్ అబ్బవరంతో కలిసి ‘సమ్మతమే’ మూవీతో వచ్చేసింది. ఇప్పటికే ఈ మూవీకి సంబందించిన ప్రొమోషన్స్ స్టార్ట్ చేసేసారు. ఇందులో భాగంగా కిరణ్, చాందిని కలిసి అలీతో సరదాగా షో కి వచ్చి తమ మనసులో మాటల్ని ఆడియన్స్ తో షేర్ చేసుకున్నారు. "ఇండస్ట్రీలో తనని కనబడకుండా చేస్తానని ఒక నిర్మాత అనడం నిజమేనా అంటూ అలీ అడిగిన ప్రశ్నకు నిజమే అని చెప్పింది చాందిని. తనతో పాటు తన ఫ్యామిలీని కూడా బాగా భయపెట్టాడట. చివరికి తన సినిమాకు ఒప్పించుకుని కాంట్రాక్టు మీద సైన్ చేయించుకున్నాడట. రెండేళ్ల పాటు రిహార్సల్స్ చేస్తున్నా మూవీ తియ్యట్లేదేమిటా అని కూడా అనుకుందట చాందిని. ఈ గ్యాప్ లో తనకు చాలా మంచి మూవీ ఆఫర్స్ కూడా వదులుకోవాల్సి వచ్చిందని చెప్పింది . ఆ మూవీ డైరెక్టర్స్ తన కోసం చాలా కాలం వెయిట్ చేశారట .
ఇండస్ట్రీలో అప్పటికి ఎవరేమిటో తెలీదు..దాంతో అడుగు ముందుకు వేయలేకపోయాను. చాలా భయమేసి అలాగే సైలెంట్గా ఉన్నాను అని చెప్పింది. ముందుకు వెళ్లనివ్వకుండా, ఆఫర్స్ రాకుండా చేస్తానని బెదిరించాడట. వన్ ఫైన్ మార్నింగ్ ఆయన సైన్ చేయించుకున్న కాంట్రాక్టు కూడా వాలిడ్ కాదని నాకు తెలిసింది. నేనేదో ఆయన మూవీని రిజెక్ట్ చేశాననే పుకారు షికారు చేసింది అని బాధపడుతూ చెప్పింది చాందిని . మరి ఇండస్ట్రీలో పెద్దవాళ్లెవరినీ కలవలేదా అని అలీ అడిగేసరికి " నాకు బ్యాక్ గ్రౌండ్ ఏముందని వెళ్ళను, ఎవరి దగ్గరకు వెళ్ళను ? అలా వెళ్తే చిటికెలో మసి చేసేస్తారు కదా అంటూ ఎమోషన్ అయ్యింది చాందిని చౌదరి . ఎలాంటి మూవీస్ ని మిస్ చేసుకోవాల్సి వచ్చింది అని ఆలీ అడిగేసరికి ఊహలు గుసగుసలాడే, కుమారి 21 ఎఫ్ , పటాస్, దృశ్యం ఈ మూవీస్ మిస్ చేసుకున్నానని లేదంటే ఇప్పుడు ఒక మంచి స్థాయిలో ఉండేదాన్ని అని అంది చాందిని. ఈమె చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి. ఇంతకు ఎవరా నిర్మాత అంటూ చాలామంది ఆలోచిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



