ఈసారి పుట్టినరోజు జరుపుకోని హీరో
on Jun 11, 2018
జూన్ 22 వచ్చిందంటే చాలు... తమిళనాడులో మంచి సందడి నెలకొంటుంది. ఎందుకంటే ఆ రోజు సూపర్‌స్టార్ విజయ్ పుట్టినరోజు కనుక. కానీ ఈసారి విజయ పుట్టినరోజు జరుపుకోవడం లేదు. ఎందుకో తెలుసా! తూత్తుకుడిలో పోలీసు కాల్పులలో మరణించిన ఉద్యమకారులకి సంఘీభావంగా. ఇప్పటికే ఆయన తూత్తుకుడి వెళ్లి అక్కడి బాధితులకి తోచిన ఆర్థికసాయం చేశారు. తన చర్య మీడియా దృష్టిని ఆకర్షించకూడదని, చీకటివేళే వెళ్లివచ్చారు. ఇప్పుడు ఈ పుట్టినరోజు రద్దు. మొత్తానికి విజయ్ చర్యలు తమిళనాడు ప్రభుత్వాన్ని కాస్త ఇరకాటంలేనే పెడుతున్నట్లున్నాయి.