సల్మాన్‌ను చంపేందుకు కుట్ర
on Jun 11, 2018

ఆ గ్యాంగ్‌స్టర్ సల్మాన్‌ఖాన్‌ను చంపాలనుకున్నాడు. అలాగని అతనికి సల్మాన్‌తో ఏ పాతకక్షలో లేవు. సల్మాన్ అతని మనసుని గాయపరిచాడంతే! లారెన్స్ బిష్ణోయ్ తెగకు చెందిన ఓ గ్యాంగ్‌స్టర్. బిష్ణోయ్ తెగ గురించి ఇప్పుడు అందరికీ తెలిసిందే! ప్రకృతిని అమితంగా ప్రేమించే ఈ తెగ ఆ ప్రకృతిని కాపాడటం కోసం ఎంతకైనా తెగిస్తుంది. నిజానికి వాళ్ల పట్టుదల వల్లే సల్మాన్‌కు కృష్ణజింకను చంపిన కేసులో జైలు శిక్ష పడింది. కానీ ఆ శిక్ష సరిపోదనుకున్నాడు. లారెన్స్. అందుకే తన అనుచరుడు సంపత్‌కు భారీ సుపారీ ఇచ్చి సల్మాన్‌ను చంపమని ఆదేశించిఆడు. సల్మాన్‌ను చంపేందుకు సంపత్ రెండుసార్లు అతని అపార్టుమెంట్ దగ్గర రెక్కీ కూడా నిర్వహించాడు. కానీ ఈలోగా ఆయుధాలు సమకూర్చుకునేందుకు హైదరాబాదుకి వచ్చి, ఇక్కడ పోలీసులకి చిక్కాడు. సల్మాన్ బతికిపోయాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



