
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో, రాజకీయాల్లో తనకంటు ఒక ట్రెండ్ క్రియేట్ చేసుకున్న దళపతి విజయ్(Vijay)మరో అరుదైన ఘనతని సొంతం చేసుకున్నారు. దీంతో అభిమానులతో పాటు తన పార్టీ వర్గాల్లో జోష్ వచ్చినట్లయింది.
ప్రముఖ సినిమా వెబ్ సైట్ ఐఎండీబీ (IMDb)తాజాగా విడుదల చేసిన 'పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్' జాబితాలో విజయ్ రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నారు.. అంతకు ముందు వారంలో 21 వ స్థానంలో ఉన్న విజయ్ ఇప్పుడు సెకండ్ ప్లేస్ కి రావడం విశేషం.ప్రతి వారం ఐఎండీబీ తన సైట్‌లోని పేజీ వ్యూస్ ఆధారంగా ఈ జాబితాని రూపొందిస్తుంది. మే 2026 నాటికి ఉన్న క్రేజ్ ప్రకారం విజయ్ ఈ ఘనత సాధించారు. బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ మరియు ఇతర పాన్ ఇండియా హీరోలను వెనక్కి నెట్టి విజయ్ ఈ స్థానంలో నిలవడం విశేషం.
Also read: Peddi: భోపాల్‌లో పెద్ది సౌండ్: ఏఆర్ రెహమాన్ లైవ్ పెర్ఫార్మెన్స్‌తో స్పెషల్ సాంగ్ లాంచ్
సినిమాల నుంచి తప్పుకుని పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్తున్నానని ప్రకటించినప్పటి నుండి ఆయనపై సోషల్ మీడియాలో మరియు ఇంటర్నెట్‌లో సెర్చ్ విపరీతంగా పెరిగింది.






