Home

»

Latest News

Peddi: భోపాల్‌లో పెద్ది సౌండ్:  ఏఆర్ రెహమాన్ లైవ్ పెర్ఫార్మెన్స్‌తో స్పెషల్ సాంగ్ లాంచ్

May 13, 2026 1:05PM

 

మరింత సందడిని పెంచిన పెద్ది 
మూడో సాంగ్ కోసం అందరు వెయిటింగ్ 
ఈ నేపథ్యంలో అధికార ప్రకటన
మెగా జాతర మొదలైనట్టే 

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)వన్ మాన్ షో పెద్ది(Peddi). చరణ్ కెరీర్ లోనే  అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతుంది. తాజాగా  మ్యూజికల్ ప్రమోషన్స్‌ కి  సంబంధించిన శుభవార్త బయటకు వచ్చింది. 'సౌండ్ ఆఫ్ పెద్ది'  పేరుతో నిర్వహించబోయే ఒక భారీ ఈవెంట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్  ఏఆర్ రెహమాన్(A.R Rehman)సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. మే 23వ తేదీన మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నగరంలో స్పెషల్ సాంగ్‌ని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ ఈవెంట్‌లో  రెహమాన్ స్వయంగా లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతుండటం విశేషం. ఆయన స్వరపరిచిన బాణీలకు స్టేజ్ మీద లైవ్ మ్యూజిక్ తోడైతే, ఆ వైబ్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇప్పటికే వచ్చిన రెండు సాంగ్స్ ఒక రేంజ్ లో సక్సెస్ అయ్యాయి. ఈ నేపథ్యంలో థర్డ్ సాంగ్ పై ఫ్యాన్స్ తో పాటు మ్యూజిక్ లవర్స్ లో ఆసక్తి నెలకొని ఉంది. ఈ సాంగ్ చరణ్, శృతి హాసన్ , జాన్వీ కపూర్ పై చిత్రీకరించారు.


Also read: Pooja Hegde: పూజాహెగ్డే అందాల అస్త్రం.. ట్రోల్ చేస్తున్న నెటిజన్స్ 

 ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌తో పాటు పలువురు బాలీవుడ్ మరియు టాలీవుడ్ ప్రముఖులు సందడి చేయనున్నారు. 'పెద్ది' చిత్రం జూన్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది.  మరి చరణ్, బుచ్చిబాబు కాంబోలో రాబోతున్న ఈ పవర్ ఫుల్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com