'లైగర్' ఈవెంట్‌కు హవాయ్ స్లిప్పర్స్‌తో వచ్చిన విజయ్.. ట్రోల్ చేసిన రణవీర్
on Jul 22, 2022

విజయ్ దేవరకొండ తన 'లైగర్' మూవీ ట్రైలర్‌ను గురువారం ఉదయం హైదరాబాద్‌లోని సుదర్శన్ 35 ఎంఎం థియేటర్ వద్ద వేలాది మంది అభిమానుల మధ్య విడుదల చేశాడు. అదే రోజు సాయంత్రం, అతను ఒక ప్రమోషనల్ ఈవెంట్ కోసం ముంబైకి వెళ్లాడు. అప్పటికే బాగా అలసిపోయిన అతను షూస్ బదులు హవాయి చెప్పులు ధరించి వెళ్లాడు. ఇది అందరి దృష్టినీ ఆకర్షించింది.
ఈవెంట్‌కు అతిథిగా వచ్చిన రణ్‌వీర్ సింగ్ , “భాయ్ కా స్టైల్ దేఖో, ఐసే లగ్ రహా హై, యే మేరే ట్రైలర్ లాంచ్ పే ఆయా హై యా మై ఇంకే ట్రైలర్ లాంచ్ పే ఆయా హు (తమ్ముడి స్టైల్ చూడండి, అతను ఇలా ఉన్నాడు. అతను నా ట్రైలర్ లాంచ్‌కి వచ్చాడా లేక నేను అతని ట్రైలర్ లాంచ్‌కి వచ్చానా)” అని పాయింట్ ఔట్ చేశాడు.
విజయ్ 'ది' అని క్యాపిటల్ లెటర్స్‌లో రాసిన నల్లటి టీ షర్ట్, లేత గోధుమరంగు కార్గో ప్యాంట్, తెల్లటి చప్పల్స్ ధరించి వచ్చాడు. రణ్‌వీర్ అతన్ని జాన్ అబ్రహంతో పోల్చాడు. ఎందుకంటే అతను కూడా ఈవెంట్స్‌లో చప్పల్స్ ధరించి కనిపిస్తుంటాడు. మరోవైపు, రణ్‌వీర్ బ్లాక్ టీ షర్ట్, ప్రింటెడ్ బ్లాక్ ప్యాంట్, సిల్వర్-గ్రే జాకెట్, బ్లాక్ బూట్‌లను ధరించాడు.
ఈ ఈవెంట్‌లో విజయ్ మాట్లాడుతూ, “ఇకపై ఉత్తరాది లేదా దక్షిణాది అని పిలవబడకుండా, భారతీయ సినిమా అని, మమ్మల్ని భారతీయ నటులు అని పిలవబడే రోజు కోసం నేను ఎదురు చూస్తున్నాను. మనం చూడాల్సిన వాస్తవికత అదే.” అన్నాడు.
ఈ కార్యక్రమంలో 'లైగర్' హీరోయిన్ అనన్య పాండే, డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ప్రొడ్యూసర్ చార్మి కూడా పాల్గొన్నారు. 'లైగర్' మూవీలో MMA ఛాంపియన్‌షిప్‌లో పోటీపడే హైదరాబాద్‌కు చెందిన అండర్‌డాగ్ ఫైటర్‌గా విజయ్ నటించాడు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం ఐదు భాషల్లో ఈ స్పోర్ట్స్ డ్రామా ఆగస్టు 25న థియేటర్లలో విడుదల కానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



