చైతూ నా భర్త కాదు, మాజీ భర్త!
on Jul 22, 2022

'కాఫీ విత్ కరణ్' షోలో తొలిసారి ఎంట్రీ ఇచ్చిన సమంత తన మాజీ భర్త నాగచైతన్యతో ఉన్న అనుబంధం గురించీ, ఆమెపై వచ్చిన, వస్తున్న రూమర్ల గురించీ మాట్లాడింది. నాగచైతన్యను ఆమె 'భర్త'గా హోస్ట్ కరణ్ జోహార్ సంబోధించినప్పుడు, వెంటనే 'మాజీ భర్త' అంటూ అతడిని కరెక్ట్ చేసింది. "మీ ఇద్దరూ స్నేహంగా ఉంటున్నారా?" అని కరణ్ ప్రశ్నిస్తే, "మీరు మా ఇద్దర్నీ ఒక గదిలో ఉంచినట్లయితే, అక్కడ పదునైన వస్తువుల్ని కనిపించకుండా దాచాల్సి ఉంటుందా? అవును, ప్రస్తుతానికి" అని జవాబిచ్చింది. ఆ తర్వాత "బహుశా భవిష్యత్తులో ఇంకెప్పుడైనా" అని జోడించింది.
చైతూతో విడిపోయాక వచ్చిన సోషల్ మీడియా ట్రోలింగ్ గురించి సమంతను కరణ్ అడిగినప్పుడు, "నిజంగా దాని గురించి కంప్లయింట్ చెయ్యలేను, ఎందుకంటే అది నేను ఎంచుకున్న మార్గం. నేను పారదర్శకంగా ఉండటాన్ని ఎంచుకున్నాను. నా జీవితం గురించి చాలావరకు రివీల్ చేయదలచుకున్నాను. విడిపోయాక, నేనెక్కువ కలత చెందలేదు. ఎందుకంటే నా జీవితంలో వారు పెట్టుబడి పెట్టారు, ఆ టైమ్‌లో చెప్పలేని వాటికి జవాబులు చెప్పడం నామీదున్న బాధ్యత. దాని నుంచి బయటకు రావడం ఫర్వాలేదని అనుకుంటున్నా. ఫర్వాలేదు అనే దానికంటే బెటరే." అని చెప్పింది సామ్.
విడిపోయిన తర్వాత ఆమెకు ఎలా ఉందని అడిగితే, "చాలా కష్టపడ్డాను, ఇప్పుడు బాగానే ఉంది. ఇదివరకటి కంటే బలంగా ఉన్నాను." అనేది ఆమె జవాబు. కాఫీ విత్ కరణ్ షోలో ఆమె రిలేషన్‌షిప్ అంశం మిగతా అన్ని అంశాల కంటే డామినెంట్‌గా కనిపించింది.
విడాకుల తర్వాత తన ఎదుర్కొన్న అత్యంత క్లిష్టమైన రూమర్ గురించి ఆమె మాట్లాడింది. భరణంగా తను రూ. 250 కోట్లు అందుకున్నాననే రూమర్స్ వచ్చాయని ఆమె చెప్పింది. తన భరణం వదంతులు వచ్చాక ఇన్‌కమ్ టాక్స్ అధికారులు తన ఇంటికి వస్తారేమోనని ఎదురుచూశానని కూడా ఆమె జోక్ చేసింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



