ముంబై వీధుల్లో విజయ్, రష్మిక చక్కర్లు!
on Dec 20, 2021

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇప్పటిదాకా కలిసి నటించింది రెండు సినిమాల్లోనే గానీ లవ్లీ పెయిర్ గా గుర్తింపు తెచ్చుకుంది ఈ జంట. 'గీత గోవిందం' సినిమాతో మొదటిసారిగా కలిసి నటించి సంచలన విజయాన్ని అందుకున్న ఈ జంట.. ఆ తర్వాత 'డియర్ కామ్రేడ్' సినిమాతో అలరించారు. మొదటి సినిమాతో వీళ్ళ మధ్య ఫ్రెండ్ షిప్ స్టార్ట్ అయింది. అది రెండో సినిమాకి బలపడింది. వీళ్ళ బంధంపై లవ్ అంటూ రూమర్స్ కూడా వచ్చాయి. అయితే తాము ఫ్రెండ్స్ మాత్రమే అని ఇద్దరూ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఇక తాజాగా ముంబై వీధుల్లో చక్కర్లు కొడుతూ మరోసారి వార్తల్లో నిలిచింది ఈ జంట.
విజయ్, రష్మిక తాజాగా ముంబయి వీధుల్లో చక్కర్లు కొట్టారు. ఇద్దరూ కలిసి ఆదివారం సాయంత్రం బాంద్రాలోని ఓ రెస్టారెంట్ లో డిన్నర్ కు వెళ్లారు. ఆ సమయంలో అక్కడున్న కొంతమంది వీరిని ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలారోజుల తర్వాత విజయ్-రష్మిక కలిసి కనిపించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు వీరి బంధంపై మరోసారి చర్చలు మొదలయ్యాయి.

ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ 'లైగర్' చేస్తున్నాడు విజయ్. ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ఇక రష్మిక తాజాగా అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన 'పుష్ప ది రైజ్' తో ప్రేక్షకులను పలకరించింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



