'సుధీర్ బాబు' కొత్త సినిమా లాంఛ్.. దర్శకుడిగా 'అమృతం' ఫేమ్ హర్ష వర్ధన్
on Dec 20, 2021

నటుడిగా, రచయితగా మెప్పించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు 'అమృతం' ఫేమ్ హర్ష వర్ధన్ దర్శకుడిగానూ ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఆయన దర్శకత్వం వహించిన మొదటి సినిమా 'గుడ్ బ్యాడ్ అగ్లీ' ఇంకా విడుదలకు నోచుకోకపోయినా.. దర్శకుడిగా ఆయనకు మరో అవకాశం వచ్చిన సంగతి తెలిసిందే. యంగ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబుతో ఆయన చేస్తున్న సినిమా ప్రకటన జులై లోనే వచ్చింది. తాజాగా ఈ మూవీ పూజా కార్యక్రమాలతో లాంఛ్ అయింది.
కథా ప్రాధాన్యమున్న సినిమాలు చేస్తూ అలరించే సుధీర్ బాబు.. హర్ష వర్ధన్ దర్శకత్వంలో మరో విభిన్న చిత్రాన్ని చేస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై నారాయణ దాస్, రామ్ మోహన్ రావు నిర్మిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో మూవీ టీమ్ పాల్గొంది. ముహూర్తపు సన్నివేశానికి రామ్మోహన్ క్లాప్ కొట్టారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే వారం ప్రారంభం కానుంది.

సుధీర్ బాబు 15వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ చైతన్ భరద్వాజ్ సంగీతం అందించనున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



