ఎప్పుడైనా యాక్టింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టొచ్చు!!
on Jul 25, 2019
విజయ్ దేవరకొండ మాటలు వినడానికి చాలా ఆసక్తికరంగా ఉండటమే కాదు....అప్పుడప్పుడు సంచలనాలు కూడా అవుతుంటాయి. ప్రస్తుతం అలాంటి షాకింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. `నటన నుంచి నేనెప్పుడైనా రిటైర్ అవ్వచ్చని `` అంటూ డియర్ కామ్రేడ్ ప్రమోషన్ లో భాగంగా ఓ కార్యక్రమంలో ప్రకటించాడు. దీంతో అంతా షాకయ్యారు. ` నాకు సినిమాలకు మించి ఏదైనా ఇంట్రస్టింగ్ గా అనిపిస్తే , లేదా నటనపై బోర్ కొట్టినా యాంక్టింగ్ కి ఫుల్ స్టాప్ పెడతాను `` అంటూ చెప్పుకొచ్చాడు. మరి మ్యారేజ్ గురించి అడగ్గా...పెళ్లి అప్పుడే కాదు మరో ఐదేళ్లు వరకు చేసుకోను అంటూ చెప్పుకొచ్చాడు. విజయ్ దేవరకొండ నటించిన `డియర్ కామ్రేడ్` చిత్రం ఈ నెల 26న గ్రాండ్ గా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా సాంగ్స్ , ట్రైలర్స్ పాజిటివ్ వైబ్స్ ని క్రియేట్ చేశాయి. విజయ్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది.