మళ్లీ కెమెరా కళ్లకు దొరికిన 'గీత గోవిందం'.. ఈసారి జిమ్ బయట!
on Apr 19, 2021
.jpg)
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మరోసారి కెమెరా కళ్లకు దొరికిపోయారు. ఇటీవలే వారు ముంబైలో ఓ రెస్టారెంట్‌కు డిన్నర్ చేయడానికి కలిసి వెళ్లి కెమెరాలకు చిక్కడం, ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడం చూశాం. నిన్న ఆదివారం మరోసారి వారు జిమ్ నుంచి కలిసి బయటకు వస్తూ కనిపించారు. విజయ్ దేవరకొండ ముఖం కనిపించకుండా బీనీతో మొత్తం కప్పేసుకున్నాడు. దానికి తోడు మాస్క్ కూడా ఉంది. రష్మిక మాత్రం ముఖానికి మాస్క్ కూడా లేకుండా చాలా సౌకర్యంగా కనిపించింది. పైగా మంచి హ్యాపీ మూడ్‌లో ఉన్నట్లు హాయిగా నవ్వుతోంది. విజయ్ ఏదో చెప్పడంతో ఆమె నవ్వుతోందని తెలుస్తోంది. కెమెరాలు తమను గమనిస్తున్నాయని గ్రహించినట్లు ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన కారులోకి వెళ్లి కూర్చున్నాడు విజయ్.

రష్మిక చేతిలో వైట్ ఫ్లవర్స్ గుచ్ఛం కనిపిస్తోంది. వాటిని రష్మిక కొన్నదా, లేక విజయ్ గిఫ్ట్‌గా ఇచ్చాడా అనే విషయం మనకు తెలీదు. 'గీత గోవిందం' సినిమాలో తొలిసారి జంటగా నటించేప్పుడు వారిద్దరి మధ్య మొదలైన స్నేహం, 'డియర్ కామ్రేడ్' సినిమా చేసే టైమ్‌లో మరింత బలపడింది. వాళ్ల ఆఫ్‌స్క్రీన్ కెమిస్ట్రీపై రకరకాల రూమర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం నడుస్తోంది. అయితే తాము గుడ్ ఫ్రెండ్స్‌మంటూ వారు చెప్తున్నారు. ఏదేమైనా వాళ్ల మధ్య బంధం ఏమిటనేది కాలమే డిసైడ్ చేస్తుంది.

విజయ్, రష్మిక వేర్వేరు సినిమాల షూటింగ్‌లతో ముంబైలో ఉన్నారు. రష్మిక రెండు బాలీవుడ్ సినిమాలు చేస్తోంది. ఒకటి.. సిద్ధార్థ్ మల్హోత్రా జోడీగా చేస్తున్న 'మిషన్ మజ్ను' కాగా, మరొకటి అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటిస్తోన్న 'గుడ్‌బై'. విజయ్ పాన్ ఇండియా ఫిల్మ్ 'లైగర్' షూటింగ్ కూడా ముంబైలో జరుగుతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



