కాజల్, తమన్నా ఫెయిల్.. సమంత మాటేంటి?
on Apr 19, 2021
ఐదేళ్ళ వ్యవధిలో తెలుగు తెరకు నాయికలుగా పరిచయమయ్యారు మిల్కీ బ్యూటీ తమన్నా, టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్, కుందనపు బొమ్మ సమంత. `శ్రీ` (2005)తో తెలుగునాట తమన్నా నటనకు శ్రీకారం చుట్టగా.. `లక్ష్మీ కళ్యాణం` (2007)తో కాజల్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇక `ఏమాయ చేసావె` (2010)తో సామ్ తొలి అడుగేసింది. వీరిలో తమన్నా, కాజల్ కి మొదటి ప్రయత్నాల్లో నిరాశజనక ఫలితాలు ఎదురైనా.. రెండో సినిమాలతో విజయాలు అందుకున్నారు. ఇక సామ్ కి తొలి ప్రయత్నమే సక్సెస్ అందించింది.
కట్ చేస్తే.. వేర్వేరు సంవత్సరాల్లో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ మువ్వురు ముద్దుగుమ్మలు ఈ క్యాలెండర్ ఇయర్ లోనే డిజిటల్ ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఫిబ్రవరిలో కాజల్ నటించిన తొలి వెబ్ - సిరీస్ `లైవ్ టెలికాస్ట్` డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ కాగా.. ఏప్రిల్ లో తమన్నా మొదటి వెబ్ - సిరీస్ `లెవెన్త్ అవర్` ఆహాలో స్ట్రీమ్ అయింది. ప్రచార చిత్రాలతో ప్రామిసింగ్ గా అనిపించినా.. ఫైనల్ గా ఈ సిరీస్ ద్వయం నిరాశను మిగిల్చాయి. ఈ నేపథ్యంలో.. అందరి కళ్ళు కూడా సామ్ డెబ్యూ వెబ్ - సిరీస్ `ద ఫ్యామిలీ మ్యాన్ సీజన్ - 2`పై ఉన్నాయి. మరి.. కాజల్, తమన్నా తరహాలో సామ్ కూడా డిజప్పాయింట్ చేస్తోందో.. లేదంటే వారిద్దరికి భిన్నంగా ఎంగేజ్ చేసే సిరీస్ తో మస్త్ ఎంటర్ టైన్ చేస్తుందో తెలియాలంటే మరికొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
త్వరలోనే `ద ఫ్యామిలీ మ్యాన్ సీజన్ - 2` అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది.
Also Read