అనన్య అదరగొడుతోందంటున్న 'ఫైటర్'
on Nov 21, 2020
పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేస్తోన్న బైలింగ్యువల్ మూవీ 'ఫైటర్'లో టైటిల్ రోల్ పోషిస్తోన్న విజయ్ దేవరకొండ, అందులో తన జోడీగా నటిస్తోన్న బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండేను ప్రశంసల్లో ముంచెత్తుతున్నాడు. ఆమె నటన అదిరిపోయిందని చెప్తున్నాడు. ఆమె సీనియర్ యాక్టర్ చంకీ పాండే కుమార్తె. 'ఫైటర్'తో ఆమె టాలీవుడ్‌లో అడుగుపెడ్తుండగా, విజయ్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు.
బాలీవుడ్‌లో బెస్ట్ డైరెక్టర్స్‌తో పనిచేస్తోన్న అనన్య ఇంతకుముందు నేరుగా ఓటీటీలో రిలీజైన 'ఖాలీ పీలీ' మూవీలో కనిపించింది. ఆ మూవీతో మఖ్బూల్ ఖాన్ డైరెక్టర్‌గా పరిచయమయ్యాడు. లేటెస్ట్‌గా ఓ ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనన్య పర్ఫార్మెన్స్ గురించి విజయ్ మాట్లాడాడు. "ఆమె ఒక స్వీట్‌హార్ట్, నిజంగా స్వీట్ గాళ్. ఆమెను ఇక్కడ చూడటం తెలుగువాళ్లకు, దక్షిణాది ప్రేక్షకులకు ఆనందాన్నిస్తుంది. ఇప్పటి దాకా 50 శాతం సినిమా చేశాం. ఆమె తన నటనతో అదరగొట్టింది. కచ్చితంగా ఈ సినిమా ఆమెకు మంచి పేరుతో పాటు, చాలా అవకాశాలు తీసుకొస్తుందని అనుకుంటున్నా" అని చెప్పాడు విజయ్.
అంతకు ముందు ఓ ఇంటర్వ్యూలో అనన్య మాట్లాడుతూ, "ఫైటర్ సెట్స్‌పై రోజూ కొన్ని తెలుగు మాటలు నేర్చుకుంటున్నా. ఎన్ని భాషల్లో వీలైతే అన్ని భాషల్లో నా క్యారెక్టర్‌కు నేనే డబ్బింగ్ చెప్పడానికి ట్రై చేస్తా. విజయ్ కైండ్, స్మార్ట్ పర్సన్. చక్కగా మాట్లాడతాడు" అని చెప్పింది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
