ఓవర్‌నైట్ స్టార్ ఎక్కడ..?
on Feb 1, 2018
విజయ్ దేవరకొండ.. ఒకే ఒక్క సినిమాతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయిన నటుడు. డిఫరెండ్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, స్క్రీన్‌ప్లేతో వచ్చిన అర్జున్ రెడ్డి వసూళ్ల దుమ్ము దులిపింది. వివాదాలు, పెదవి విరుపుల సంగతి పక్కనబెడితే.. ట్రెండ్ సెట్టర్‌గా విమర్శకుల ప్రశంసలు పొందింది. ఇక టాలీవుడ్‌కు కొత్త లవర్‌బాయ్ దొరికాడంటూ సినీజనాలు పండగ చేసుకున్నారు. ఇంతమంది ఆశలను, ఆకాంక్షలను మోస్తోన్న విజయ్ దేవరకొండ తర్వాతి సినిమాపై సహజంగానే అంచనాలుంటాయి. ప్రస్తుతం ఈ యువకథానాయకుడి చేతిలో అరడజనుకు పైగా సినిమాలున్నాయి. వీటిలో మూడు సినిమాలు వేసవికే సందడి చేసేలా ఉన్నాయి.
మర్రి శ్రీధర్ దర్శకత్వంలో "ఏమంత్రం వేసావే"తో పాటు.. గీతా ఆర్ట్స్ నిర్మిస్తోన్న సినిమాలోనూ.. మహానటి సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కుతోన్న "మహానటి"లోనూ విజయ్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇది కాక "మళ్లీ మళ్లీ ఇది రానిరోజు" ఫేం క్రాంతి మాధవ్ దర్శకత్వంలోనూ దేవరకొండ నటిస్తున్నాడు. కనీసం పది, పదిహేను సినిమాలు చేస్తేనే కానీ రానీ ఫాలోయింగ్ విజయ్‌కి రావడంతో.. ఇప్పుడు అతను దానిని నిలబెట్టుకుంటాడా..? అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు క్రిటిక్స్. అర్జున్‌రెడ్డిని చూసిన జనం తర్వాతి సినిమాలో కూడా అర్జున్‌రెడ్డికి మించిన కంటెంట్‌ను, నటనను ఎక్స్పెక్ట్ చేస్తారు. వీటిలో ఏమాత్రం తేడా వచ్చినా విజయ్ పోటీలో వెనకపడిపోవడం ఖాయం. సో.. కథల్ని జాగ్రత్తగా ఎంపిక చేసుకుని.. సినిమాల్ని డీల్ చేయాలని సూచిస్తున్నారు సినీజనాలు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
