బాలీవుడ్‌కు నో చెప్పిన క్రేజీ హీరో!!
on Dec 27, 2018
`నేషనల్ వైడ్ గా `అర్జున్ రెడ్డి` చిత్రంతో పేరు తెచ్చుకున్న టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ. వరుస విజయాలతో దూసుకెళ్తోన్న ఈ క్రేజీ స్టార్ బాలీవుడ్ లో నటించబోతున్నాడు అంటూ ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్ సినిమా ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఒక సారి వివరాల్లోకి వెళితే... బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ మెయిన్ క్యారక్టర్ లో కపిల్ దేవ్ బయోపిక్ ను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ఆ జనరేషన్ కు చెందిన ఓ క్రికెటర్ క్యారక్టర్ కు విజయ్ దేవరకొండను సంప్రదించిందట ఆ చిత్ర యూనిట్. అయితే బాలీవుడ్ లో నేరుగా హీరోగానే ఎంట్రీ ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్న విజయ్ క్యారక్టర్ రోల్స్ లో చేయడం ఇష్టం లేక నో చెప్పినట్లు తెలుస్తోంది. ప్రజంట్ డియర్ కామ్రేడ్ షూటింగ్ లో బిజీ బిజీ గా గడుపుతోన్న విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో వచ్చే ఏడాది బిజీ కాబోతున్నాడు.