విజయ్ దేవరకొండ 'హీరో' ఆగిందా? లేదు!
on Jul 30, 2019
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెలుగు, తమిళ భాషల్లో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ 'హీరో' అనే చిత్రాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కొలీవుడ్ కుర్రాడు ఆనంద్ దర్శకుడు. ఇందులో విజయ్ దేవరకొండ బైక్ రేసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఓ షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి చేశారు. అయితే... ఆ సన్నివేశాలు విజయ్ దేవరకొండకు, నిర్మాతలకు నచ్చలేదని, దర్శకుడి ప్రతిభపై సందేహాలు కలగడంతో చిత్రాన్ని పక్కన పెట్టేశారు అని, దాదాపు ఆ సినిమా ఆగిపోయినట్టేనని వార్తలు వచ్చాయి. వీటిని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు ఖండించారు. క్రాంతిమాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమా పూర్తయిన తర్వాత 'హీరో' చిత్రీకరణ తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు. రేస్ కోర్స్ లో షూటింగ్ కు అనుమతి లభించడంతో ఒక షెడ్యూల్ పూర్తి చేశారట. సాధారణంగా రేస్ కోర్స్ లో అనుమతి లభించడం కష్టమని తెలుస్తోంది. అలాగే, 'డియర్ కామ్రేడ్' ఫలితంపై మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు.