ఓ అభిమాని సెల్ఫీ పేరుతో విద్యతో ఏం చేశాడో తెలుసా..?
on Mar 14, 2017
స్మార్ట్ఫోన్లు వచ్చిన దగ్గర నుంచి సెల్ఫీల గోల ఎక్కువైంది. ఇక సెల్ఫీ పిచ్చోళ్లకి, సెలబ్రిటీలు కనపించారో ఇక అంతే సంగతులు వారితో సెల్ఫీ తీసుకునేదాకా విడిచిపెట్టరు. ఇదే ఇప్పుడు సెలబ్రిటీలకు ఇబ్బందిగా మారింది. ఈ విషయంలో హీరోయిన్ల పరిస్థితి మరీ ఘోరం. తాజాగా ఈ సెల్ఫీ గోలకు బాధితురాలిగా మారింది బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్. రీసెంట్గా ఆమె నటించిన "బేగమ్ జాన్" వచ్చే నెలలో విడుదల కాబోతోంది.
ఇటీవల ఆ మూవీ ప్రమోషన్ కోసం ఆ చిత్ర నిర్మాత మహేశ్ భట్, దర్శకుడు శ్రీజిత్ ముఖర్జీలతో కలిసి కోల్‌కతా ఎయిర్‌పోర్టులోకి వెళుతోంది. సరిగ్గా ఇదే సమయంలో విద్యను గుర్తించిన ఓ అభిమాని పరుగుపరుగున వచ్చి సెల్ఫీ కావాలంటూ అడిగాడు. దానికి ఆమె ఓకే చెప్పింది.
దీంతో అతను ఆమె భుజంపై చేయి వేసి సెల్ఫీ దిగే ప్రయత్నం చేశాడు. ఒక్కసారిగా షాక్‌కు గురైన విద్య చేయి తీయమని చెప్పింది..అతను వినపడనట్లుగా అలాగే ఉంచాడు..వెంటనే ఆమె మేనేజర్ వచ్చి చేయి తీసేయమని చెప్పాడంతో తీసివేశాడు. ఆ తర్వాత సెల్ఫీ కోసం ఫోన్ వైపు చూసింది విద్య. కానీ, అతని చేయి భుజంపై నుంచి తన వీపుపై కదులుతున్నట్టు గ్రహించిన విద్య తీవ్ర ఆగ్రహానికి గురైంది. నీవేం చేస్తున్నావో తెలుస్తోందా? ఏమనుకుంటున్నావ్? అంటూ అతనిపై విరుచుకుపడింది. అనంతరం ఈ ఘటనపై స్పందించిన విద్యాబాలన్..పరిచయం లేని వ్యక్తి మన మీద చేయి వేస్తే ఎంతో అసౌకర్యంగా ఉంటుందని..తాము పబ్లిక్ ఫిగర్సే కానీ, పబ్లిక్ ప్రాపర్టీ కాదనీ చెప్పింది.