భూమా నాగిరెడ్డి నిర్మాత అని మీకు తెలుసా
on Mar 14, 2017
నంద్యాల ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత భూమా నాగిరెడ్డి గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే..నాగిరెడ్డి అంటే రాజకీయ నాయకుడిగానే చాలా మందికి తెలుసు..కానీ ఆయన ఒక నిర్మాత అన్న విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. భూమాకి సినిమాలంటే చాలా ఇష్టం, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ అంటే వీరాభినం..సినిమాల మీద పిచ్చితోనే శ్రీ వీరబ్రహ్మేంద్ర కంబైన్స్ మూవీ క్రియేషన్స్ పేరుతో పలు చిత్రాలను నిర్మించారు. తమ్మారెడ్డి భరద్వాజ దర్శకత్వంలో "నా కూతురు" అనే సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. అలాగే సుమన్ కథానాయకుడిగా నటించిన పలు చిత్రాలను నిర్మించారు. టాలీవుడ్ అగ్రనటులు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్‌లతో భూమాకి మంచి సాన్నిహిత్యం ఉంది. ఆయన ఆకస్మిక మరణంపై పలువురు సినీరంగ ప్రముఖులు తమ సంతాపం ప్రకటించారు.
Also Read