ఇది ఫాలో అయితే ఈజీగా బరువు తగ్గవచ్చు.. విద్యాబాలన్ వెల్లడి
on Jul 8, 2025

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ 'నందమూరి తారకరామారావు'(NTR)జీవిత కథ ఆధారంగా అయన తనయుడు గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)నటించి, రూపొందించిన చిత్రాలు 'ఎన్టీఆర్ కథానాయకుడు'(Ntr Kadanayakudu), 'ఎన్టీఆర్ మహానాయకుడు'(Ntr Mahanayakudu).ఈ రెండు చిత్రాల్లో ఎన్టీఆర్ సతీమణి 'బసవతారకమ్మ'(Basavatarakam)క్యారక్టర్ ని అద్భుతంగా పోషించి మెప్పించిన బాలీవుడ్ నటి విద్యాబాలన్.
రీసెంట్ గా విద్యా బాలన్ తన శరీర ఆకృతికి సంబంధించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు కెరీర్ ఆరంభం నుంచి నా శరీర ఆకృతి విషయంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాను. లావు తగ్గడానికి డైట్స్ తో పాటు కఠినమైన జిమ్ సెషన్స్ కి వెళ్ళాను. కానీ లావు విషయంలో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఆ తర్వాత చెన్నై(Chennai)కి చెందిన 'ఆముర' అనే న్యుట్రిషన్ గ్రూప్ వాళ్ళని సంప్రదిస్తే, నేను బరువు పెరగడానికి లావు కాదని ఇన్ ఫ్లమేషన్ (శరీరంలో ఉన్న వాపు ) వల్ల లావు పెరిగానని చెప్పారు. ఆ తర్వాత వాళ్ళు సూచించిన డైటింగ్ ప్లాన్ ని పాటించాను. ఏడాది పాటు వ్యాయామం చెయ్యవద్దని సూచించారు. దాంతో వర్క్ ఔట్స్ చెయ్యకుండా బరువు తగ్గానని విద్యా బాలన్ చెప్పుకొచ్చింది.
2003 వ సంవత్సరంలో 'భలో థేకో' అనే బెంగాలీ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన విద్యా బాలన్ ఆ తర్వాత 2005 లో సంజయ్ దత్, సైఫ్ అలీ ఖాన్ హీరోలుగా చేసిన 'పరిణీత' అనే మూవీతో హిందీ సినీ రంగ ప్రవేశం చేసింది. ఇప్పటి వరకు సుమారు నలభైకి పైగా చిత్రాల్లో నటించగా వాటిల్లో ఎక్కువ భాగం విజయం సాధించినవే. గత ఏడాది హర్రర్ కామెడీ 'భూల్ భూలయ్య 3'(Bhool Bhulaiyaa 3 ) లో మంజులిక, మల్లికా అనే రెండు వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషించి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో నవ్వులు పూయించింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



