ఎన్టీఆర్ అలా.. హృతిక్ ఇలా.. వార్-2 ఎలా..?
on Jul 8, 2025
'వార్-2'తో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందుతోన్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకుడు. ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే వార్-2 షూటింగ్ పూర్తయింది. ఈ నేపథ్యంలో నిన్న(జూలై 7) సోషల్ మీడియా వేదికగా స్పందించాడు ఎన్టీఆర్. వార్-2 ప్రేక్షకులకు బిగ్ సర్ప్రైజ్ ఇస్తుందని చెప్పాడు. అలాగే వార్-2 ప్రయాణంలో హృతిక్ రోషన్ నుండి తాను చాలా నేర్చుకున్నానని అన్నాడు. ఇక ఇప్పుడు హృతిక్ వంతు వచ్చింది.
వార్-2 గురించి తాజాగా హృతిక్ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. "వార్-2 పూర్తి కావడంతో మిక్స్డ్ ఎమోషన్స్ ని ఫీల్ అవుతున్నాను. ఎన్టీఆర్ గారితో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నాను. ఇద్దరం కలిసి ప్రత్యేకమైనదాన్ని సృష్టించాము. ఆదిత్య చోప్రా, అయాన్ ముఖర్జీ యొక్క అద్భుతమైన సినిమాటిక్ విజన్ ను మీ అందరికీ చూపించడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను." అని హృతిక్ రాసుకొచ్చాడు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
