ప్రిన్స్ మహేష్ బాబు సరసన సమంత కాదంట
on Jan 4, 2012
ప్రిన్స్ మహేష్ సరసన సమంత కాదంట అని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై, విక్టరీ వేంకటేష్, ప్రిన్స్ మహేష్ బాబు హీరోలుగా నటిస్తూండగా, "కొత్తబంగారులోకం" ఫేం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న విభిన్నకథా చిత్రం "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు".
ఈ చిత్రంలో ప్రిన్స్ మహేష్ బాబు సరసన సమంత హీరోయిన్ గా నటిస్తూందని వినపడింది. దానికి "దూకుడు" చిత్రం సూపర్ హిట్టవటం కూడా ఒక కారణం కావచ్చు. అయితే సమంత రామ్ చరణ్ సరసన "ఎవడు" చిత్రంలోనూ,క నాగచైతన్య సరసన "ఆటోనగర్ సూర్య" చిత్రంలోనూ, గౌతం మీనన్ దర్శకత్వంలో మూడు భాషల్లో నిర్మించే చిత్రంలోనూ నటిస్తుండటం వల్ల ప్రస్తుతం సమంత డేట్లు ఖాళీ లేకపోవటంతో మరో హీరోయిన్ని మహేష్ బాబు కోసం వెతకాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇప్పటికే వెంకటేష్ సరసన నటింప జేయటానికి సరైన హీరోయిన్ దొరకటం లేదని ఇబ్బంది పడుతున్న దిల్ రాజుకి ఇది మరో ఇబ్బంది పెట్టే అంశం. ఇంతకీ ప్రిన్స్ మహేష్ బాబు సరసన ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించే అదృష్టం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



