జనవరి 15 న మనోజ్ "మిస్టర్ నోకియా" ఆడియో
on Jan 4, 2012
జనవరి 15న మనోజ్ "మిస్టర్ నోకియా" ఆడియో విడుదల కానుందని విశ్వసనీయవర్గాలద్వారా అందిన సమాచారం. ఈ "మిస్టర్ నోకియా" చిత్రంలో రాక్ స్టార్ మంచు మనోజ్ కుమార్ హీరోగా, కృతి కర్బందా హీరోయిన్ గా, అని (అనిల్ కృష్ణ) దర్శకత్వంలో, డియస్.రావు నిర్మిస్తున్న విభిన్నప్రేమకథా చిత్రం "మిస్టర్ నోకియా". "మిస్టర్ నోకియా" చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ "మిస్టర్ నోకియా" చిత్రంలోని యాక్షన్ సీన్లకు హీరో మంచు మనోజ్ కుమారే కొరియోగ్రఫీ నిర్వహించారనీ, చాలా రిస్కీ షాట్లలో కూడా ఆయన డూప్ లేకుండా నటించారనీ సమాచారం.
అంతే కాదు మనోజ్ ఈ చిత్రంలో ఒక చక్కని పాట కూడా వ్రాశారని తెలిసింది. ప్రముఖ సినీ రచయిత లక్ష్మీ భూపాల్ ఈ "మిస్టర్ నోకియా" చిత్రానికి సంభాషణలు వ్రాశారు. ఈ "మిస్టర్ నోకియా" చిత్రం ఆడియోని ఆదిత్య మ్యూజిక్ ద్వారా, దుర్గం చెరువులో సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన మార్కెట్లోకి విడుదల చేయాలని విడుదలచేయాలని ఆలోచిస్తున్నారట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



