Home

»

Latest News

పాపుల‌ర్‌ క‌న్న‌డ న‌టుడు-ద‌ర్శ‌కుడు శివ‌రామ్ క‌న్నుమూత‌

Dec 04, 2021

 

ప్ర‌ముఖ క‌న్న‌డ న‌టుడు శివ‌రామ్ బెంగ‌ళూరులోని ఓ ప్రైవేట్ హాస్పిట‌ల్‌లో క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌సు 83 సంవ‌త్స‌రాలు. మంగ‌ళ‌వారం (న‌వంబ‌ర్ 30) బెంగ‌ళూరులోని త‌న ఇంట్లో రాత్రి పూజ చేస్తూ ఆయ‌న కుప్ప‌కూలిపోయారు. ఆయ‌న‌ను ఓ ప్రైవేట్ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించ‌గా, ప‌రీక్షించిన డాక్ట‌ర్లు మెద‌డులో ర‌క్త‌స్రావం అయిన‌ట్లు వెల్ల‌డించారు. ఈ నెల‌లోనే శ‌బ‌రిమ‌ల ఆల‌యాన్ని సంద‌ర్శించాల‌ని ఆయ‌న భావించారు.

శివ‌రామ్‌కు చికిత్స అందించిన వైద్యులు ఆయ‌న వ‌య‌సు, ఇత‌ర స‌మ‌స్య‌ల కార‌ణంగా స‌ర్జ‌రీ వీలుకాద‌ని చెప్పారు. అయితే ఆరోగ్యం క్షీణించ‌డంతో ఈరోజు డిసెంబ‌ర్ 4న శివ‌రామ్ తుదిశ్వాస విడిచారు. ఆయ‌న అకాల మ‌ర‌ణంతో అభిమానులు, క‌న్న‌డ సినీ ప్ర‌ముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి లోన‌య్యారు.

Also read:  సీతారామ‌శాస్త్రికి సుకుమార్ అక్ష‌ర నివాళి.. వైర‌ల్ అయిన ఎలిజీ!

గ‌త‌వారం శివ‌రామ్ కారు ప్ర‌మాదానికి గురైన‌ట్లు స‌మాచారం. అయితే ఆయ‌న‌కు పెద్ద‌గా గాయాలు కాలేద‌ని స‌న్నిహిత వ‌ర్గాలు తెలిపాయి. ఆయ‌న అంత్య‌క్రియ‌లు రేపు జ‌ర‌గ‌నున్నాయి.

Also read:  హీరో కిరణ్‌ అబ్బవరం సోదరుడు మృతి!

శివ‌రామ్ 1938 జ‌న‌వ‌రి 28న జ‌న్మించారు. 1958లో స‌హాయ ద‌ర్శ‌కుడిగా ప‌నిచేయ‌డం ద్వారా సినీ ఇండ‌స్ట్రీలో కెరీర్ ప్రారంభించారు. కె.ఆర్‌. సీతారామ‌శాస్త్రి, పుట్ట‌న్న క‌ణ‌గ‌ల్‌, సింగీతం శ్రీ‌నివాస‌రావు లాంటి దిగ్గ‌జ ద‌ర్శ‌కుల ద‌గ్గ‌ర ప‌నిచేశారు. 1965లో 'బెరెతా జీవా' అనే సినిమాతో న‌టుడిగా మారారు. త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల ఆద‌రాభిమానాల‌ను పొందారు. 1972లో తొలిసారి 'హృద‌య సంగ‌మ' అనే చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అంతేకాదు, ర‌జ‌నీకాంత్ త‌మిళ సినిమా 'ధ‌ర్మ దురై'ని రాశిక‌ళామందిర్ బ్యాన‌ర్‌పై నిర్మించారు కూడా.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com