హీరో కిరణ్ అబ్బవరం సోదరుడు మృతి!
on Dec 1, 2021
టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తమ్ముడు రామాంజులు రెడ్డి బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు.
కిరణ్ సోదరుడు రామాంజులు కడప జిల్లా సంబేపల్లె మండలం దుద్యాల గ్రామంలో నివాసం ఉంటున్నాడు. బుధవారం ఉదయం కడప జిల్లా చెన్నూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. రామాంజులు మృతితో దుద్యాల గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
'రాజావారు రాణిగారు' సినిమాతో టాలీవుడ్ కి హీరోగా పరిచయమైన కిరణ్.. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత వచ్చిన 'ఎస్ఆర్ కల్యాణ మండపం' సినిమాతో ఆకట్టుకున్న కిరణ్ చేతిలో ప్రస్తుతం మూడు నాలుగు చిత్రాలు ఉన్నాయి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
