సీనియర్ ఎడిటర్ గౌతంరాజు మృతి
on Jul 6, 2022

సీనియర్ సినీ ఎడిటర్ గౌతంరాజు కన్నుమూశారు. నాలుగు దశాబ్దాలకు మించిన కెరీర్‌లో మూడు తరాల కథానాయకుల సినిమాలకు ఎడిటర్‌గా పనిచేసి, ఎన్నో సినిమాలు సూపర్ హిట్ కావడంలో తన వంతు భాగస్వామ్యం పంచుకున్న ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ వచ్చారు. మంగళవారమే డిశ్చార్జి అయిన ఆయన అదే రోజు అర్ధరాత్రి తీవ్ర అస్వస్థతకు గురై, 1:30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 68 సంవత్సరాలు.
సినిమాలే ప్రపంచంగా, తనే పనే పరమావధిగా వందలాది చిత్రాలకు అలుపెరుగకుండా పనిచేస్తూ వచ్చారు గౌతంరాజు. ఇటీవలి కాలంలో ఖైదీ నంబర్ 150, అదుర్స్, గబ్బర్ సింగ్, రేసుగుర్రం, కిక్, గోపాల గోపాల లాంటి చిత్రాలకు ఆయన ఎడిటర్‌గా పనిచేశారు. అదివరకు మేజర్ చంద్రకాంత్, ఎర్రమందారం, ఖైదీ ఇన్‌స్పెక్టర్, చంటబ్బాయ్, నారీ నారీ నడుమ మురారి, దిల్, యజ్ఞం, ఠాగూర్ లాంటి చిత్రాలకు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించిందీ ఆయనే.
తెలుగులోనే కాకుండా, హిందీ, తమిళం, కన్నడలోనూ అనేక సినిమాలకు ఆయన పనిచేశారు. గౌతంరాజు మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో జరగనున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



