నయన వెంకీని వెయిట్ చేయిస్తోందా..
on Feb 9, 2016
.jpg)
విక్టరీ వెంకటేష్ పేరుకు తగ్గట్టే ఆయన ట్రాక్ రికార్డ్ ఉంటుంది. ఆయనకు ఫ్లాఫ్ పర్సంటేజ్ అందరు హీరోల కంటే చాలా తక్కువ. తన సినిమాలో అన్నీ కరెక్ట్ గా ఉండేలా చూసుకోవడమే, వెంకీ విజయ రహస్యం. ఇప్పుడు వెంకీకి సోలో హిట్ కావాలి.అందుకే భలే భలే మగాడివోయ్ లాంటి హిట్ సినిమాతో ఊపుమీదున్న మారుతి డైరెక్షన్ లో సినిమాకు కమిట్ అయ్యారు వెంకటేష్. మారుతికి కూడా ఫాస్ట్ గా సీన్స్ తీసేసే అలవాటు ఉండటంతో, మార్చి ఎండింగ్ కల్లా సినిమాకు కంప్లీట్ గా ప్యాకప్ చెప్పేద్దామనుకున్నారు.
కానీ ఇప్పుడు వారికి సడెన్ గా నయనతార రూపంలో సమస్య వచ్చిపడిందని సమాచారం. ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు దాటిపోయినా, ఇప్పటికీ ఫామ్ లోనే ఉన్న సీనియర్ హీరోయిన్ నయన్. తమిళ సినిమాలతో ఆమె డైరీ ఫుల్ అయిపోయింది. ఇప్పుడు వెంకీ ' బాబు బంగారం ' సినిమాకు ఆమెనే తీసుకున్నారు. నయన డేట్స్ ఇంకా అడ్జస్ట్ కాకపోవడంతో, ఆమెతో ఒక్క సీన్ కూడా తీయలేదు. ప్రస్తుతానికి నయన సీన్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయని ఫిలిం నగర్ టాక్. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ, మూవీని స్పీడ్ గా రోల్ అవుట్ చేసేయాలనుకున్న ' బాబు బంగారం ' టీమ్ డిజప్పాయింట్ అవుతున్నారట..మరి నయనకు ఎప్పుడు ఖాళీ అవుతుందో చూడాలి..
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



