టాలీవుడ్ కి హాలీవుడ్ సమ్మర్ పోటీ
on Feb 9, 2016

టాలీవుడ్ హీట్ ను మరింత పెంచే సినిమాలన్నీ వేసవి వేడిలోనే వరస కట్టబోతునాయి. వాటిలో పవన్ సర్దార్ గబ్బర్ సింగ్, మహేష్ బ్రహ్మోత్సవం, అల్లు అర్జున్ సరైనోడు లాంటివి ఉన్నాయి. కానీ అదే టైమ్ లో టాలీవుడ్ హీరోలకు పోటీ ఇవ్వడానికి వస్తోంది ఒక హాలీవుడ్ పిల్లల సినిమా. బహుశా ఈ సినిమాను ఇష్టపడని ఇండియన్స్ ఉండరేమో. ఇప్పుడున్న పెద్దవాళ్లు చాలామంది, చిన్నప్పుడు ఎంతో ఇష్టంగా చూసిన ఆ సినిమాయే జంగిల్ బుక్. ఈ సమ్మర్ లోనే రియల్ యాక్షన్ గా రాబోతున్న జంగిల్ బుక్, తెలుగు సినిమాలకు పోటీగా మారింది. అవతార్, అవెంజర్స్ లాగే , జంగిల్ బుక్ కూడా తెలుగు సినిమాలకు గండికొడుతుందేమోనన్న భయం ఇప్పుడు టాలీవుడ్ లో ఉంది. జంగిల్ బుక్ స్టోరీ అంతా ,ఇండియాలోనే జరుగుతుంది. ఇప్పటికే ట్రైలర్ కు ఇండియా లో భారీగా ఆదరణ లభించడం విశేషం..
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



