ఈసారి సోలోగా రానున్న వెంకీ?
on Jun 2, 2020

సీనియర్ స్టార్ 'విక్టరీ' వెంకటేష్‌కి సంక్రాంతి సీజన్‌తో మంచి అనుబంధమే ఉంది. వెంకీ కెరీర్‌లో ఆల్ టైమ్ హిట్స్‌గా నిలిచిన 'చంటిస (1992), 'కలిసుందాం రా' (2000) చిత్రాలు ఈ సీజన్‌లోనే సందడి చేశాయి. 'శత్రువు' (1991), 'ధర్మచక్రం' (1996), సలక్ష్మీ' (2006) తదితర వెంకీ హిట్ సినిమాలు కూడా ఇదే సీజన్‌లో వసూళ్ళ వర్షం కురిపించాయి.
అంతేకాదు.. సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలసి నటించిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' (2013), పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో జట్టుకట్టిన 'గోపాల గోపాల' (2015), మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో సందడి చేసిన 'ఎఫ్ 2' (2019).. సంక్రాంతి సీజన్ మూవీస్‌సే కావడం విశేషం.
కాగా ఇదే సీజన్‌లో మరో సినిమాతో రాబోతున్నాడు వెంకీ. ఆ చిత్రం మరేదో కాదు.. 'నారప్ప'. తమిళనాట బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన 'అసురన్' మూవీకి రీమేక్‌గా ఈ 'నారప్ప' రూపొందుతోంది. శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని సురేష్ బాబు, కలైపులి యస్.థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగి ఉంటే ఈ వేసవిలోనే 'నారప్ప' సందడి చేసి ఉండేవాడు. అనూహ్యంగా కరోనా ఎఫెక్ట్‌తో సమ్మర్ సీజన్‌ని మిస్ చేసుకున్నట్లయ్యింది. ఇంకా ముప్పై శాతం చిత్రీకరణ బాకీ ఉన్న నేపథ్యంలో.. మరి కొద్ది రోజుల్లో చిత్రీకరణని పునఃప్రారంభించేందుకు యూనిట్ ప్లాన్ చేస్తోంది. అలాగే వెంకీ లక్కీ సీజన్ అయిన సంక్రాంతికి 'నారప్ప'ని విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్. త్వరలోనే 'నారప్ప' విడుదల తేదీపై క్లారిటీ వస్తుంది.
మొత్తానికి గత కొంతకాలంగా సంక్రాంతి సీజన్‌లో మల్టీస్టారర్స్‌తోనే పలకరిస్తూ వస్తున్న వెంకీ.. మళ్లీ చాలా కాలం తరువాత సోలో బాట పట్టనుండడం ఆసక్తికరమే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



