కరణం మల్లీశ్వరిగా పంజాబీ ముద్దుగుమ్మ?
on Jun 2, 2020

భారత దేశం నుండి ఒలింపిక్ మెడల్ అందుకున్న తొలి మహిళ, దేశానికి గర్వకారణమైన తెలుగు ముద్దుబిడ్డ, వెయిట్ లిఫ్టర్ కరణం మల్లీశ్వరి బయోపిక్ తీస్తున్నట్టు రచయిత, నిర్మాత కోన వెంకట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన తర్వాత కరణం మల్లీశ్వరి పాత్రలో ఎవరు నటిస్తారనే ఆసక్తి మొదలైంది. నటీనటుల పేర్లు ఏవీ ఖరారు చేయలేదు. కానీ, మల్లీశ్వరిగా పంజాబీ ముద్దుగుమ్మ నటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సమాచారం.
తాప్సి లేదా రకుల్ ప్రీత్ సింగ్... ఇద్దరిలో ఎవరో ఒకరిని కరణం మల్లీశ్వరి పాత్రకు ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారట. రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పటివరకు బయోపిక్స్ చేయలేదు. ఒకవేళ ఈ సినిమా అంగీకరిస్తే ఇదే ఆమెకు తొలి బయోపిక్ అవుతుంది. సినిమా కోసం వెయిట్ పెరగాల్సిన అవసరం కూడా ఏర్పడుతుందేమో. తాప్సి అయితే బయోపిక్స్ చేసింది. షూటింగ్ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ షూటర్ దాదీస్ జీవితాల ఆధారంగా తెరకెక్కిన 'సాండ్ కి ఆంఖ్' చేశారు. 'రష్మీ రాకెట్' అని మరో ఫిక్షనల్ బయోపిక్ చేస్తున్నారు. ఇద్దరిలో ఎవరు చేస్తారో చూడాలి. లేదంటే మరొకరు చేస్తారో? వెయిట్ అండ్ వాచ్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



