వెంకీ దృశ్యం ప్రారంభం
on Feb 21, 2014

మలయాళంలో మోహన్ లాల్, మీనా జంటగా నటించిన "దృశ్యం" చిత్రం ఇటీవలే విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇందులో మోహన్ లాల్ పాత్రలో వెంకటేష్ నటిస్తున్నారు. ఈరోజు ఉదయం ఈ చిత్ర ముహూర్త కార్యక్రమాలు జరిగాయి. తెలుగులో కూడా "దృశ్యం" అనే టైటిల్ ను ఖరారు చేసారు. వెంకీ సరసన మీనాని హీరోయిన్‌గా తీసుకున్నట్లు సమాచారం. ఇందులో నదియా పోలీసు ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. శ్రీప్రియ దర్శకత్వం వహించబోతుంది. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



