19న వైజాగ్‌లో 'అల వైకుంఠపురములో' విజయోత్సవం!
on Jan 17, 2020

అల్లు అర్జున్ హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'అల వైకుంఠపురములో' బాక్సాఫీస్ దగ్గర ఆశ్చర్యకరమైన ఫలితాలతో దూసుకుపోతోంది. బన్నీ కెరీర్‌లోనే హయ్యెస్ట్ గ్రాసర్ ఫిలింగా నిలిచేందుకు ఉరకలు వేస్తోంది. గతానికి భిన్నంగా ఓవర్సీస్‌లోనూ కూడా ఈ చిత్రం రికార్డు ఓపెనింగ్స్ దక్కించుకోవడం గమనార్హం. సినిమా ఇంతటి ఘన విజయం సాధించిన సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం అభిమానుల సమక్షంలో బహిరంగంగా ఈ విజయోత్సవ సభ నిర్వహించబోతున్నారు. జనవరి 19న వైజాగ్‌లో ఈ విజయోత్సవం జరుగుతుందని నిమ్రాణ సంస్థలు గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ప్రకటించాయి.
పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి తమన్ అందించిన సంగీతం పెద్ద ఎస్సెట్‌గా నిలిచి, సినిమా 2020 ఫస్ట్ బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్‌గా నిలిచేందుకు దోహదపడింది. తొలిసారి బన్నీ చేసిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా పేరు తెచ్చుకున్న ఈ మూవీలో బన్నీ క్యారెక్టరైజేషన్, ఆ క్యారెక్టర్‌లో బన్నీ అందించిన వినోదం ప్రేక్షకుల్ని అమితంగా అలరిస్తున్నాయని వసూళ్లు తెలియజేస్తున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



