టాలీవుడ్ లో మరో విషాదం!
on Mar 21, 2023
తెలుగు సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ప్రముఖ పబ్లిసిటీ ఇంఛార్జ్ వీరమాచనేని ప్రమోద్ కుమార్(87) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం నాడు తుదిశ్వాస విడిచారు. 38 సంవత్సరాల సినీ ప్రస్థానంలో ప్రమోద్ కుమార్ 300 చిత్రాలకు పబ్లిసిటీ ఇంచార్జ్ గా పని చేశారు. వాటిలో 30 కి పైగా చిత్రాలు శతదినోత్సవం జరుపుకున్నాయి. కొన్ని చిత్రాల్లో నటించి నటుడిగానూ మెప్పించిన ఆయన.. రెండు చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. మోహన్ బాబు తో దొంగ పోలీస్, గరం మసాలా చిత్రాలు నిర్మించారు. రచయితగానూ రాణించారు. 'సుబ్బయ్య గారి మేడ' అనే నవల రాశారు. అలాగే తన సినీ అనుభవాలను 'తెర వెనుక తెలుగు సినిమా' పేరుతో గ్రంథస్థం చేశారు. ఇది నంది పురస్కారానికి ఎంపిక కావడం విశేషం.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
