వరుణ్ తేజ్ సరసన ‘ఖిలాడి’ బ్యూటీ
on Jul 25, 2023

మెగా హీరోలంటే మాస్ ఇమేజ్ ఉన్న సినిమాలు ఎక్కువగా గుర్తుకు వస్తాయి. అయితే వీటికి భిన్నంగా కెరీర్ ప్రారంభం నుంచి వెరైటీ సినిమాలు చేసుకుంటూ వెళుతున్న మెగా క్యాంప్ హీరో వరుణ్ తేజ్. ఈ యంగ్ హీరో లేటెస్ట్‌గా ఓ పీరియాడిక్ సినిమాలో నటించటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పలాస సినిమాను డైరెక్ట్ చేసిన కరుణ కుమార్ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. 1945-75 మధ్య జరిగిన కొన్ని నిజ ఘటనలను ఆధారంగా చేసుకుని ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరిని తీసుకున్నారు.
ఇచ్చట వాహనములు నిలుపరాదు, ఖిలాడి, రీసెంట్‌గా వచ్చిన హత్య చిత్రాల్లో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే మీనాక్షి చౌదరికి వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్, త్రివిక్రమ్ చిత్రం `గుంటూరు కారం` సినిమాలో ఈ బ్యూటీ డాల్ నటిస్తోంది. దీంతో పాటు ఇప్పుడు వరుణ్ తేజ్ సినిమాలో ఈ సొగసరి ఛాన్స్ దక్కించుకుందంటే హీరోయిన్‌గా మీనాక్షి రేంజ్ క్రమ క్రమంగా పెరుగుతుంది. మెగా క్యాంప్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి ఇక వారి మెగా హీరోల సినిమాల్లో ఎన్ని అవకాశాలు దక్కించుకుంటుందో చూడాలి మరి.
ఇప్పుడు వరుణ్ తేజ్ హీరోగా శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో ఓ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది. యాక్షన్ అంటే కమర్షియల్ సినిమాల్లోని ఫైట్స్ ఉండే సినిమాలా కాకుండా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతోంది. ఇందులో మానుషి చిల్లర్ హీరోయిన్. మరో వైపు ఆగస్ట్ 25న వరుణ్ తేజ్ కథానాయకుడిగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన `గాంఢీవధారి అర్జున` సినిమా రిలీజ్ అవుతుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



