‘జైలర్’ సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతంటే!
on Jul 25, 2023

సూపర్‌స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ మూవీ `జైలర్`. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ఆగస్ట్ 10న తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. వరల్డ్ వైడ్‌గా రజినీకాంత్‌కున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు `జైలర్` సినిమాను భారీ రేంజ్‌లో విడుదల చేస్తున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్.. మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. యాక్షన్ సన్నివేశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.
తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న `జైలర్` సినిమా రన్ టైమ్ 2 గంటల 49 నిమిషాలు అని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇటు తెలుగు, అటు తమిళంలో రజినీకాంత్ సాలిడ్‌గా హిట్ కొట్టి చాలా రోజులైంది. ఆయన అభిమానులు సైతం ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జూలై 28న చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకకి మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు.
జైలర్ ట్రైలర్ కోసం కూడా ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా వెయిటింగ్‌లో ఉన్నారు. అందుకు కారణం.. ఈ సినిమాకు సంబంధించిన ఏవైనా వివరాలు ట్రైలర్‌లో అయినా తెలుస్తాయని. ఈ చిత్రంలో తమన్నా కూడా నటిస్తుంది. రీసెంట్‌గా అనిరుద్ రవిచంద్రన్ సంగీత సారథ్యంలో వచ్చిన కావాలయ్యా.. సాంగ్ నెట్టింట వైరల్ అయిన సంగతి తెలసిందే. ఈ సినిమా సక్సెస్ నెల్సన్‌కి ఎంతో కీలకం. ఇంతకు ముందు ఆయన చేసిన బీస్ట్ ఫ్లాప్ కావటంతో తను ఈ సినిమాపై ఆశలను పెట్టుకున్నాడు. మరీ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి మరి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



