హీరో ఇంట్లో... హీరో ఫ్యామిలీ కలిసి... సినిమా చూసిన హీరోయిన్!
on Nov 20, 2020

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన 'మిడిల్ క్లాస్ మెలోడీస్' గురువారం రాత్రి పది గంటల నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో వీక్షకులకు అందుబాటులోకి వచ్చింది. దేవరకొండ ఫ్యామిలీ మొత్తం ఇంట్లో భారీగా ఏర్పాటు చేసుకున్న స్క్రీన్ మీద సినిమా చూసింది. రిలీజ్ సందర్భంగా అన్నయ్య, ఫ్యామిలీతో కలిసి సినిమా చూస్తున్న ఫోటోను హీరో ట్వీట్ చేశాడు. దాన్ని గమనిస్తే హీరోయిన్ వర్ష బొల్లమ్మ కూడా కనిపిస్తుంది.
'మిడిల్ క్లాస్ మెలోడీస్'లో వర్ష బొలమ్మ హీరోయిన్. హీరో ఇంట్లో.. హీరో ఫ్యామిలీతో కలిసి ఆమె సినిమా చూసిందన్నమాట. సినిమా షూటింగులో దర్శకుడు, తాను, వర్ష మంచి ఫ్రెండ్స్ అయ్యామని ఆనంద్ దేవరకొండ తెలిపాడు. ముగ్గురం కలిసి తిరుగుతున్నామని చెప్పాడు. సినిమా రిలీజ్ సందర్భంగా ఇంటికి ఆహ్వానించి ఉండవచ్చు. అదీ మేటర్. సినిమాలో వర్ష నటనకు మంచి మార్కులు పడుతున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



