ఫస్ట్ టైమ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఇండియన్ యానిమేటెట్ ఫిల్మ్!
on Nov 19, 2020

నెట్‌ఫ్లిక్స్ తన మొదటి భారతీయ యానిమేటెడ్ ఫిల్మ్ 'బాంబే రోజ్'ను డిసెంబర్ 4న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఆ మూవీ సారాంశాన్ని క్లుప్తంగా వారు షేర్ చేశారు. బాల్య వివాహం నుంచి తప్రించుకోవడానికి బొంబాయి వీధుల్లో నివసించే ఓ యంగ్ క్లబ్ డాన్సర్ కుటుంబానికి రక్షణ కల్పించాలా, ఉగ్రవాదం కారణంగా అనాథ అయిన ఓ అబ్బాయితో ప్రేమను ఎంచుకోవాలా అనే మీమాంసను ఎదుర్కొంటుంది.
ప్రతి ఫ్రేమ్‌నూ పెయింట్ చేసినట్లుగా, మ్యూజిక్ ద్వారా అల్లిన ఈ మూవీలో ఓ ఎర్ర గులాబీ మూడు అసాధ్యమైన ప్రేమకథల్ని కలుపుతుంది. ఆ మూడు ప్రేమకథల్లో ఒకటి - ఒక హిందూ అమ్మాయి, ఓ ముస్లిం అబ్బాయి మధ్య ప్రేమ, రెండు - ఇద్దరు స్త్రీల మధ్య ప్రేమ, మూడు - బాలీవుడ్ స్టార్లపై మొత్తం సిటీ ప్రేమ. యథార్థ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ ఫిల్మ్ ప్రేమ, జీవితం విషయంలో సమాజం ప్రదర్శించే క్రూరత్వాన్ని మనకు చూపిస్తుంది.
ఇప్పటికే రిలీజ్ చేసిన 'బాంబే రోజ్' ట్రైలర్ ఈ సినిమా దేని గురించో క్లుప్తంగా మనకు తెలియజేస్తుంది. మనదేశంలో సందడిగా ఉండే వీధులను కలర్‌ఫుల్ యానిమేటెడ్ సీన్స్ ద్వారా చూడటం ఓ మంచి అనుభవాన్ని ఇస్తుందని ఊహించవచ్చు. ఆ తర్వాత ప్రేమపై వ్యక్తుల కలలు, జీవితంలో సంభవించే నాటకీయ పరిణామాలతో ఈ మూవీ ఆసక్తికరంగా సాగుతుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



