రియల్ పవర్ స్టార్ కేసీఆర్ : వర్మ
on May 2, 2016

వర్మ తన కామెంట్స్ తో మరోసారి న్యూస్ లో నిలిచారు. సర్దార్ రిలీజ్ ముందు వరకూ, సినిమా పరంగా పవన్ ను టార్గెట్ చేసిన వర్మ, ఈ సారి పొటిటికల్ గా పవన్ ను సెంటర్ చేశారు. ప్రత్యేక హోదా కోసం పవన్ తన ట్విట్టర్లో పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ లా బిజేపీ తప్పు చేయదు అనుకుంటున్నాను అంటూ పవన్ పెట్టిన ట్విట్టర్ పోస్ట్ లపై వర్మ సెటైర్ వేశారు. " మాకు బెగ్గర్ సింగ్ వద్దు. గబ్బర్ సింగ్ మాత్రమే కావాలి. రీల్ లైఫ్ లో విలన్లను బెదిరించడం కాదు. రియల్ లైఫ్ లో కూడా అదే స్థాయిలో ఉండాలి. స్పెషల్ స్టేటస్ డిమాండ్స్ ద్వారా వస్తుంది తప్ప అభ్యర్ధనల ద్వారా కాదు. సెంటర్ తోలు తీస్తానని చెప్పే కేసీఆర్ నా దృష్టిలో రియల్ పవర్ స్టార్. మాకు కేసీఆర్ లా డిమాండ్ చేసే వాళ్లే కావాలి కాని, రిక్వెస్ట్ లు చేసే పవన్ కళ్యాణ్ లు వద్దు " అంటూ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. సర్దార్ రిలీజ్ టైంలో కూడా పవన్ ను పొగుడుతూ, తిడుతూ వర్మ పవన్ ఫ్యాన్స్ తో విభేదాలు పెట్టుకున్నారు. ఆ తర్వాత ఇక నేను పవన్ పై కామెంట్స్ చేయను అని స్టేట్ మెంట్ ఇచ్చిన సంగతి కూడా తెలిసిందే. మరిప్పుడు వర్మ కామెంట్స్ పై పవన్ ఏమంటారో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



