కబాలీ చూసి పడిపోయిన రాజమౌళి..!
on May 2, 2016
.jpg)
నిన్న నెట్టింట్లో కబాలీ టీజర్ రిలీజైన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా తెలుగు తమిళ టీజర్లకు విపరీతమైన స్పందన వస్తోంది. వరల్డ్ వైడ్ రజనీ ఫ్యాన్స్ కబాలీ సినిమా తమకు పండగే అని ఫిక్సై పోయారు. కబాలీ రా..అంటూ రజనీ చెప్పిన డైలాగ్ కు ఫ్యాన్స్ తో పాటు సెలబ్రిటీలు కూడా ఫిదా అయిపోయారు. దర్శక బాహుబలి రాజమౌళి అయితే తన ట్విట్టర్లో కబాలీని ఆకాశానికెత్తేశారు. రజనీ అంటే ఇది..స్టైల్ అంటే ఇది, తలైవా అంటే ఇది అంటూ ట్వీట్ చేశాడు జక్కన్న.

రిలీజ్ చేసిన కొద్ది సేపట్లోనే వరల్డ్ వైడ్ ట్రెండింగ్ టాపిక్స్ లో చెలరేగిపోయాడు కబాలీ. బాలీవుడ్ నుంచి మల్లూవుడ్ వరకూ రజనీ టీజర్ కు భారీగా స్పందన వస్తోంది. పా రంజిత్ తెరకెక్కించిన కబాలీని కలైపులి ఎస్ థాను నిర్మించారు. మలేషియాలో ఉండే ఒక స్టైలిష్ డాన్ గా రజనీ గెటప్, డైలాగ్స్ అందర్నీ ఆకట్టుకుంటూ సినిమాపై అంచానలు పెంచేశాయి. వయసు మీద పడినా, స్టైల్ ను మెయింటెయిన్ చేయడం రజనీకి మాత్రమే చెల్లింది. రజనీ సరసన రాధికా ఆప్టే నటించగా, నాజర్, దినేష్ రవి, ధన్సిక ముఖ్యపాత్రలు పోషించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



