52 ఏళ్ళు అయితే 20 లా ఎలా కనిపిస్తున్నావో అర్ధమయ్యింది..ఆ ఐదు ఫాలో అవుతాం
on Jan 6, 2026

-బయటపడిన మలైకా అరోరా అందం సీక్రెట్
-సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో ఏముంది
-అభిమానులు, నెటిజన్స్ స్పందన ఏంటి
పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)హిట్ మూవీ 'గబ్బర్ సింగ్' లోని కెవ్వు కేక సాంగ్ ఎంత పాపులరో తెలిసిందే. ఈ సాంగ్ లో పవన్ తో కలిసి స్టెప్స్ చెయ్యడం ద్వారా తెలుగు నాట మంచి పాపులారిటీ ని సంపాదించిన భామ మలైకా అరోరా(Malaika Arora). హిందీ చిత్ర రంగానికి చెందిన మలైకా సుదీర్గ కాలం నుంచి హిందీ చిత్ర రంగంలో తన సత్తా చాటుతు వస్తుంది. సల్మాన్ ఖాన్ సోదరుడు ఆర్భాజ్ ఖాన్ మాజీ వైఫ్ కూడా అయిన మలైకా రీసెంట్ గా సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేసింది. సదరు వీడియోలో ఐదు రకాల యోగా ప్రక్రియల గురించి వివరించింది.
1 .అనులోమ విలోమ.. ఒక ముక్కు రంధ్రంతో గాలి పీల్చి మరో రంధ్రం ద్వారా వదలడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరగడంతో పాటు నాడీ వ్యవస్థని శుద్ధి శుద్ధి చేస్తుంది. మానసిక ఒత్తిడి తగ్గడంతో పాటు రక్త ప్రసరణని కూడా మెరుగుపరుస్తుంది. తద్వారా ముఖంలో సహజమైన మెరుపు వస్తుంది.
2 . కపాలభాతి : ఈ ప్రక్రియ ద్వారా వేగంగా శ్వాసని బయటకు వదలడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంతో పాటు పొట్ట భాగంలో ఉన్న కొవ్వుని కరిగిస్తుంది. ఫలితంగా చర్మాన్ని శుభ్రంగా ఉంచడమే కాకుండా బాడీని టోన్డ్ గా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
3. భ్రమరి ప్రాణాయామం: గాలిని వదిలేటప్పుడు తుమ్మెద లాగా శబ్దం చేసే ఈ ప్రక్రియ మెదడుని ప్రశాంతపరుస్తుంది. దీనివల్ల వయసు పెరిగినా ఆ ప్రభావం ముఖంపై కనిపించదు. ఆందోళనని తగ్గించడంతో పాటు హార్మోన్ల సమతుల్యతని కూడా కాపాడుతుంది..మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది.
4. భస్త్రిక : లోతుగా గాలి పీల్చుకోవడం వల్ల శరీరంలోని ప్రతి కణానికి ఆక్సిజన్ అందుతుంది.
దాంతో శరీరానికి తక్షణ శక్తిని అందించడానికి ఈ ప్రాణాయామం సహాయపడుతుంది.ఇది మెటబాలిజంని వేగవంతం చెయ్యడంతో పాటు చలికాలంలో శరీర ఉష్ణోగ్రతని క్రమబద్ధీకరించడానికి కూడా దోహదపడుతుంది.
5. ఉజ్జాయి ప్రాణాయామం: లోతుగా గాలి పీల్చి ఓం అని ఉచ్చరించడం వల్ల కలిగే ప్రకంపనలు మానసిక ప్రశాంతతని ఇస్తాయి. ఇది శ్వాసపై నియంత్రణని పెంచి, భావోద్వేగాలను అదుపులో ఉంచుతుంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారడంతో ఏభై రెండేళ్ల వయసులో కూడా మీరు ఇరవై ఏళ్ళ అమ్మాయిలా కనపడటానికి సీక్రెట్ ఏంటో ఇప్పుడు అర్థమైందని, మేము కూడా వాటిని ఫాలో అవుతామని మెసేజెస్ చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



