ప్రభాస్ సలార్ పై అంత నమ్మకం పెట్టుకోవడానికి కారణం ఇదేనా!?
on Dec 29, 2022

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జాతకం రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి- ది బిగినింగ్, బాహుబలి-ది కంక్లూజన్ చిత్రాలతో మారిపోయింది. ఈ రెండు చిత్రాలతో ఆయన పాన్ ఇండియా స్టార్ అయ్యారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అత్యధిక గుర్తింపు, ఫాలోయింగ్ ఉన్న హీరో ఎవరంటే పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ పేరే అందరూ చెప్తారు. కానీ బాహుబలి రెండు భాగాల తరువాత ఆయన చేసిన సాహో, రాధేశ్యామ్ చిత్రాలు బాగా నిరాశపరిచాయి. దీంతో ఈసారి హిట్టు కొట్టడం ప్రభాస్ కు అత్యంత ముఖ్యం. ఏ మాత్రం తేడా వచ్చినా వన్ ఇయర్ వండర్ గా మిగిలిపోతాడు. ప్రస్తుతం ప్రభాస్ ఆది పురుష్, సలార్, ప్రాజెక్ట్ కె చిత్రాలతో పాటు రాజా డీలక్స్ చేస్తున్నారు. ఆది పురుష్ చిత్రం మొదటిగా విడుదలవుతుంది అనుకున్నా కూడా ఈ చిత్రం నుండి విడుదలైన ట్రైలర్ ఏదో యానిమేషన్ ఫిలిం, కార్టూన్ ఫిలిం లాగా ఉండడంతో ప్రభాస్ మరల దాన్ని ఫ్రెష్ గా విజువల్ ఎఫెక్ట్స్ కోసం పట్టుబట్టి మరీ పంపించారు. ఈ ట్రైలర్ చూసిన తర్వాత ప్రభాస్ వీరాభిమానులు కూడా దర్శకుడు ఓం రౌత్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
అలా ట్రోల్స్ కు గురవడంతో ఆది పురుష్‌కు మరల మొదటి నుండి విఎఫ్ఎక్స్ పనులను చేస్తున్నారు. మరోవైపు ప్రభాస్ చేస్తున్న మరో చిత్రం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ వరల్డ్ సినిమా ప్రాజెక్ట్ కె. ఈ చిత్రం టైం ట్రావెల్ మూవీ గా ఓ సైన్స్ ఫిక్షన్ గా రూపొందుతోంది. ఈ మూవీతో ప్రభాస్ గ్లోబల్ స్టార్ అవుతాడని దర్శకనిర్మాతలు ఎంతో నమ్మకంగా ఉన్నారు. దాంతో ఈ సినిమా చిత్రీకరణకు చాలా సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ మూవీ 2024 ఎండింగ్లో గాని రిలీజ్ కాదు అంటున్నారు. ఇక సందీప్ రెడ్డి వంగాతో చేయనున్న స్పిరిట్ చిత్రం ఎప్పుడు పూర్తవుతుందో తెలీదు. అసలు ఎప్పుడు మొదలవుతుందో కూడా క్లారిటీ లేదు. ఇలాంటి సందర్భంలో ప్రభాస్ నుండి ముందుగా వచ్చే చిత్రాలు సలాం తో పాటు మారుతి దర్శకత్వం వహిస్తున్న రాజా డీలక్స్ అనే అర్థమవుతుంది. సలార్ విషయానికి వస్తే బాహుబలి హీరో, కేజీఎఫ్ డైరెక్టర్ ఇద్దరు కలిసి అన్‌లిమిటెడ్ బడ్జెట్ తో సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఆ రేంజ్ ని మించి ఉంటుందని నిర్మాతలు వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ చిత్రాన్ని కూడా హోం బలే ప్రొడక్షన్స్ బడ్జెట్ను ముందుగానే కేటాయించకుండా ఎంతైనా కేటాయించేందుకు సిద్ధపడుతూ రూపొందిస్తోంది. ఈ మూవీ మనం ఎన్ని భారీ అంచనాలతో వచ్చిన దాన్ని మించి ఉంటుందని నిర్మాతలు స్టేట్మెంట్ ఇచ్చారు. దాంతో పాటు ఈ సినిమా అనుకున్నట్టుగానే సూపర్ గా వస్తుందని, సినిమా 80% షూటింగ్ పూర్తయిందని, వచ్చే ఏడాది అనుకున్న టైమ్ కి రీచ్ చేస్తామని చెప్పారు. దాంతో ప్రభాస్ తదుపరి చిత్రం సలార్, రాజా డీలక్స్.... ఈ రెంటిలో ఏది అవుతుంది? అనే ఆసక్తి కలుగుతోంది. ఇక కేజిఎఫ్ సినిమా కోలార్ మైనింగ్ గురించి తీస్తే సలార్ మూవీ సింగరేణి బ్యాక్ డ్రాప్ లో వస్తుందని అంటున్నారు. మొదట్లో ఒకే భాగంగా తీయాలనుకున్నప్పటికీ సలార్‌ను కూడా బాహుబలి, కే జి ఎఫ్ లాగానే రెండు భాగాలుగా రిలీజ్ చేస్తారని టాక్. మొత్తానికి ప్రభాస్ కు సలార్, రాజా డీలక్స్ అయినా సరైన హిట్‌ని ఇచ్చి మరోసారి ఆయన సత్తాను చాటుతాయని.... సాహె, రాధేశ్యామ్ పరాజయాలను మరిచేలా ఈ మూవీస్ ఉంటాయని ఆయన అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



