పాయల్‌పై నెటిజన్ అసభ్యకర కామెంట్... ఘాటుగా స్పందించిన హీరోయిన్!
on Nov 28, 2023
సోషల్ మీడియా వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో.. అంతే నష్టాలు కూడా జరుగుతున్నాయి. ఏ విషయం అయినా క్షణాల్లో ప్రపంచంలోని ఎవ్వరికైనా చేరిపోతోంది. దీన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది నెటిజన్లు సెలబ్రిటీలపై రకరకాల కామెంట్స్ చేస్తూ వారిని ఇబ్బంది పెడుతున్నారు. దానివల్ల అలాంటి కామెంట్స్ క్షణాల్లో వైరల్‌గా మారిపోతున్నాయి. ఈమధ్యకాలంలోనే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు నెటిజన్లు. ముఖ్యంగా హీరోయిన్లను టార్గెట్ చేస్తూ పెడుతున్న కామెంట్స్ అందరికీ ఇబ్బంది కలిగిస్తున్నాయి.
తాజాగా హీరోయిన్ పాయల్ రాజ్‌ఫుత్ గురించి ఒక నెటిజన్ పెట్టిన కామెంట్ అందరికీ చిరాకు కలిగిస్తోంది. అయితే ఆ కామెంట్‌కి ధీటుగా పాయల్ సమాధానం ఇవ్వడంతో అందరూ ఆమెను శభాష్ అంటూ మెచ్చుకుంటున్నారు. ‘ఆర్‌ఎక్స్ 100’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైన పాయల్ ఆ సినిమాలో తన అందచందాలతో యూత్‌ని విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా ఘనవిజయం సాధించింది. మళ్ళీ పాయల్‌తోనే అజయ్ భూపతి చేసిన ‘మంగళవారం’ సినిమా ఇటీవల విడుదలై మంచి టాక్‌తో రన్ అవుతోంది. ఇదిలా ఉండగా.. ఓ నెటిజన్ ‘మంగళవారం’ సినిమాలోని ఓ సీన్ క్లిప్‌ను ట్విట్టర్‌లో షేర్ చేసాడు. అంతే కాదు.. ఆమె లో దుస్తుల గురించి ఈ పోస్ట్ పెట్టాడు. దీనికి రియాక్ట్ అయిన పాయల్ ఆ సీన్‌లో తాను వేసుకున్న లో దుస్తులు నావి కావని, ప్రొడక్షన్ వాళ్లు ఇచ్చినవని సమాధానం ఇచ్చింది. ఎంతో డేరింగ్‌గా ఆ నెటిజన్‌కి సమాధానమిచ్చిన పాయల్‌ను అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఆ నెటిజన్ పోస్టును తప్పుబడుతూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
