త్వరలోనే గర్ల్ ఫ్రెండ్ గా రష్మిక యాక్షన్ షురూ!
on Nov 28, 2023

అనౌన్స్ మెంట్ తోనే సినీ ప్రియుల్లో ఆసక్తిని కలిగించింది నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న 'ది గర్ల్ ఫ్రెండ్'. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 'చి.ల.సౌ'తో దర్శకుడిగా మారి ఆకట్టుకున్న రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాను దర్శకుడు. విద్య కొప్పినేని, ధీరజ్ మొగిలినేని నిర్మాతలు. 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమా కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభమైంది.
'ది గర్ల్ ఫ్రెండ్' సినిమా ముహూర్తపు సన్నివేశానికి అల్లు అరవింద్ క్లాప్ నివ్వగా, డైరెక్టర్ మారుతి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. బేబీ ఫేమ్ డైరెక్టర్ సాయి రాజేష్ ఫస్ట్ షాట్ కు దర్శకత్వం వహించారు. వైవిధ్యమైన ప్రేమ కథతో తెరకెక్కనున్న 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమా త్వరలో రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనుంది.

గత నెలలో 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమా అనౌన్స్ మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్, మోషన్ పోస్టర్ ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ప్రేక్షకులకు ఒక కొత్త సినిమాటిక్ ఎక్సీపిరియన్స్ ఇస్తుందని మూవీ టీమ్ చెబుతోంది.
హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



