Home

»

Latest News

సాత్విక వీరవల్లి: ఫస్ట్ మూవీ రిలీజ్ కాకముందే వరుస ఆఫర్లు.!

Nov 18, 2026 2:30PM

సినిమా ఇండస్ట్రీలో ఒక్క సినిమా విడుదల కాకముందే వరుస అవకాశాలు రావడం అంటే చిన్న విషయం కాదు. ఇప్పుడు హీరోయిన్ సాత్విక వీరవల్లి విషయంలో అదే జరుగుతున్నట్లు కనిపిస్తోంది. దుల్కర్ సల్మాన్ నటిస్తున్న ‘ఆకాశంలో ఒక తార’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ అమ్మడికి.. తొలి సినిమా విడుదలకు ముందే మరో రెండు క్రేజీ ప్రాజెక్టుల్లో అవకాశాలు వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న RC17లో సాత్విక పేరు వినిపిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఆమె ఎంపికయ్యే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.

ఇక తాజాగా నాగచైతన్య 25వ సినిమాలోనూ సాత్విక వీరవల్లికి అవకాశం వచ్చినట్లు వార్తలు వచ్చాయి. దర్శకుడు క్లాక్స్ తెరకెక్కించనున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించనున్నారు. ఇటీవల యాంకర్ సుమతో జరిగిన ఇంటర్వ్యూలో నిర్మాత అల్లు అరవింద్ సాత్విక ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైనట్లు తెలిపారు.

నాగచైతన్య 25వ సినిమాగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్‌ను నవంబర్ 23న ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.

ఇది కూడా చదవండి: RC17 హీరోయిన్ సర్‌ప్రైజ్.. ఐదుగురికి లుక్ టెస్ట్.!

సాత్విక నటిస్తున్న ‘ఆకాశంలో ఒక తార’ నవంబర్ 20న విడుదల కానుంది. ఈ సినిమా విడుదలకు ముందే నాగచైతన్య సినిమాలో అవకాశం రావడం ఆమె కెరీర్‌కు మంచి ప్రారంభంగా చెప్పుకోవచ్చు. మరోవైపు RC17లోనూ ఆమె పేరు వినిపిస్తుండటంతో ఈ అమ్మడి పేరు ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చకు వస్తోంది.

మరి తొలి సినిమా విడుదల కాకముందే ఇన్ని క్రేజీ ఆఫర్లు వస్తున్న సాత్విక వీరవల్లి.. రాబోయే రోజుల్లో ఇంకెన్ని పెద్ద ప్రాజెక్టుల్లో కనిపిస్తుందో చూడాలి.

మీకు నచ్చవచ్చు:
ఆకాశంలో ఒక తార vs డియర్ ఆస్ట్రోనాట్.. ఒకే రోజు ఒకే కథతో రెండు సినిమాలు.!
అప్పుడు ‘మల్లెపూల పల్లకి’.. ఇప్పుడు ‘రఘుకుల తిలక’.!

 

 

 

[Aakasamlo Oka Tara Movie, Satvika Veeravalli,  Naga Chaitanya NC25, Ram Charan RC17]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com