
సినిమాలో పాటలు హిట్టయితే ప్రమోషన్స్‌కు ఎంత ప్లస్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్ని సందర్భాల్లో సినిమా కంటే పాటలే ముందుగా ప్రేక్షకుల్లోకి వెళ్లి అంచనాలను పెంచుతుంటాయి. ‘ఇరుముడి’ సినిమాలోని ‘మల్లెపూల పల్లకి’ పాట ఇందుకు మంచి ఉదాహరణ. ఆ పాట సినిమాకు మంచి గుర్తింపు తీసుకురావడమే కాకుండా, మూవీ ప్రమోషన్స్‌లోనూ కీలకంగా నిలిచింది. ఇప్పుడు కిరణ్ అబ్బవరం నటిస్తున్న ‘రియాలిటీ’ కూడా ఇలాంటి ప్లాన్‌తోనే ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది.
‘రియాలిటీ’ సినిమాలో పాపులర్ ‘రఘుకుల తిలకా రారా’ పాటను ఉపయోగిస్తున్నారట. విశేషం ఏంటంటే.. ఈ పాటను ఒరిజినల్‌గా పాడిన గాయకులతోనే మళ్లీ పాడించారట. క్వాలిటీ ఇన్‌స్ట్రుమెంట్స్, డీజే మిక్స్‌తో సరికొత్త మ్యూజిక్ ట్రీట్‌మెంట్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో పాత పాటకు కొత్త ఎనర్జీ తోడైనట్లు తెలుస్తోంది.
దర్శకుడిగా కిరణ్ అబ్బవరం ఈ పాటను సినిమాలో మంచి సందర్భంలో ఉపయోగించారట. కేవలం ప్రేక్షకులను అలరించడానికి పాటను చొప్పించకుండా.. కథలో సరైన సన్నివేశంలో వచ్చేలా ప్లాన్ చేసినట్లు టాక్. అందుకే థియేటర్లలో ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తుందని చిత్ర వర్గాలు భావిస్తున్నాయట.

‘ఇరుముడి’ సినిమాలోని ‘మల్లెపూల పల్లకి’ పాట ప్రేక్షకుల్లోకి బాగా వెళ్లింది. ఆ పాట సినిమా ప్రమోషన్స్‌కు కూడా ఉపయోగపడింది. అసలు ఆ పాట కోసం సినిమాకి వెళ్దాం అనుకున్నవారు కూడా ఉన్నారు. ఇప్పుడు ‘రఘుకుల తిలక’ పాట పుణ్యమా అని ‘రియాలిటీ’ విషయంలోనూ అలాంటి మ్యాజిక్ జరుగుతుందా అనే ఆసక్తి నెలకొంది.
ఇది కూడా చదవండి: 15 ఏళ్ల కొలవెరి డి.. ఆరు నిమిషాల్లో రాసిన పాట ప్రపంచాన్ని ఊపేసింది.!
‘రియాలిటీ’పై మొదటి నుంచి అంచనాలే ఉన్నాయి. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన రెండు పాటలు సంగీత ప్రియులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా 'ఉన్నంతలో మనకున్నంతలో' సాంగ్ సోషల్ మీడియాను ఊపేసింది. ఈ క్రమంలో ‘రఘుకుల తిలక’ పాటపై ఆసక్తి పెరుగుతోంది.

ఒకవైపు పాత పాటకు ఉన్న క్రేజ్.. మరోవైపు ఒరిజినల్ సింగర్స్ గొంతులు, కొత్త మ్యూజిక్ మిక్స్.. ఇవన్నీ కలిస్తే థియేటర్లలో మంచి సందడి ఉండే అవకాశం ఉంది. మరి ‘మల్లెపూల పల్లకి’ తరహాలో ‘రఘుకుల తిలక’ కూడా ‘రియాలిటీ’ ప్రమోషన్స్‌కు కీలకంగా మారుతుందా? ఈ ఒక్క పాటతో సినిమాపై హైప్ మరో స్థాయికి వెళ్తుందా? చూడాలి.
మీకు నచ్చవచ్చు:
ఏనాటి వరమో నువ్వు.. ‘మైసా’లో తండ్రీకూతుళ్ల అనుబంధంతో రెండో పాట.!
ఆకాశంలో ఒక తార vs డియర్ ఆస్ట్రోనాట్.. ఒకే రోజు ఒకే కథతో రెండు సినిమాలు.!
[Raghukula Tilaka Rara Song, Kiran Abbavaram, Reality Movie, Irumudi Movie, Mallepoola Pallaki Song]






