ఓ హిట్టు కొట్టాడు.. మూడు కోట్లు పెంచాడు
on Sep 13, 2016

టాలీవుడ్‌లో హిట్లకు ఉన్న డిమాండే వేరు. ఓ హీరో గానీ, హీరోయిన్‌గానీ హిట్టు కొట్టారంటే పారితోషికం అమాంతంగా పెరిగిపోతుంటుంది. ఆఖరికి కమిడియన్లకు కూడా వాళ్లకున్న హిట్స్‌ని చూసే పారితోషికం ఇస్తుంటారు. దాన్ని స్టార్లు కూడా క్యాష్ చేసుకొంటుంటారు. తాజాగా జనతా గ్యారేజ్ హిట్ అవ్వడంతో కొరటాల శివ కూడా కోట్ల కొండెక్కి కూర్చున్నాడు. అమాంతంగా తన పారితోషికం పెంచేశాడు. జనతా కోసం కొరటాలకు రూ.10 కోట్లు ఇచ్చారట. ఇప్పుడు తాజాగా మహేష్ బాబు సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ చిత్రానికి డి.వి.వి.దానయ్య నిర్మాత. ఈ సినిమా కోసం రూ.3 కోట్ల పారితోషికం పెంచి రూ.13 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. మరీ మూడు కోట్లు పెంచేస్తే ఎలా? అని అడిగితే శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ లెక్కలు చూపిస్తున్నాడట. 'ఎన్టీఆర్, మహేష్‌లకు వాళ్ల కెరీర్‌లోనే పెద్ద హిట్లు ఇచ్చా.. ఆ రెండు సినిమాలూ వంద కోట్లు కొట్టాయి. నాకు రూ.13 కోట్లు ఇవ్వలేరా' అని అడుగుతున్నాడట. కొరటాలకున్న క్రేజ్ చూసి తృప్తి పడిపోయిన నిర్మాత తాను అడిగిన రూ.13 కోట్లు ఇవ్వడానికి ముందుకొచ్చినట్టు తెలుస్తోంది. నిజంగా ఈ సినిమా కోసం కొరటాలకు రూ.13 కోట్లు దక్కితే... అత్యధిక పారితోషికం తీసుకొంటున్న దర్శకుల జాబితాలో నెం.2 స్థానంలోకి వెళ్లిపోతాడు. నెం.1 రాజమౌళి అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా? ఆయన పారితోషికం దాదాపు రూ.20 కోట్లకు పైమాటే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



